హైదరాబాద్: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఘనంగా నివాళులర్పించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలొడ్డి పోరాడిన పోలీసు అమరుల త్యాగాలను జాతి ఎన్నటికీ మరువదని చెప్పారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
1959 అక్టోబర్ 21న భారత జవాన్లు నాటి జమ్ముకశ్మీర్‌లోని లఢక్ జిల్లాలోని లేహ్ ప్రాంతంలో బందోబస్తులో ఉన్నారు. చైనా సైనికులు భారత జవాన్లపై దాడి చేయడంతో 11 మంది మృతిచెందారు. వారి మృతదేహాలను తీసుకువచ్చే వీలు లేకపోవడంతో జవాన్ల మృతదేహాలను అక్కడే ఖననం చేశారు. కుటుంబీకులు వారిని కడసారి చూపునకు సైతం నోచుకోలేదు. అసువులు బాసిన జవాన్ల ఆత్మలకు శాంతి కలగాలని ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వారి త్యాగాలను స్మరిస్తూ సోమవారం నుంచి ఈ నెల 31 వరకు పోలీసు శాఖ ఫ్లాగ్‌డే కార్యక్రమాలను నిర్వహిస్తున్నది.
శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలొడ్డి పోరాడిన పోలీసు అమరుల త్యాగాలను జాతి ఎన్నటికీ మరువదు. వారి త్యాగాలను స్మరించుకుంటూ ‘పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం’ సందర్భంగా ఘన నివాళులు! pic.twitter.com/MYj7KevuQh
— KTR (@KTRBRS) October 21, 2024