మెదక్ : మెదక్( Medak)జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. కారు, ఆటో ఢీ కొనడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన నర్సాపూర్ పట్టణ సమీపంలోని మెడలమ్మ గుడి సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న రెండు ఆటోలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చి క్షతగాత్రులను నర్సాపూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Cold Weather | రాష్ట్రంలో కనిష్ఠానికి పడిపోయిన ఉష్ణోగ్రతలు.. అత్యల్పంగా సిర్పూర్లో 6.5 డిగ్రీలు
KTR | ఆడబిడ్డల చదువుకై అక్షర సమరం చేసిన చదువుల తల్లి సావిత్రీబాయి: కేటీఆర్
RRR | పరిహారంపై పీటముడి.. ఆర్ఆర్ఆర్ భూసేకరణపై వీడని సందిగ్ధత!