హైదరాబాద్: రాష్ట్రంలో చలిపులి (Cold Weather) వణికిస్తున్నది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. రాష్ట్రంలో అత్యల్పంగా కుమ్రం భీమ్ జిల్లా సిర్పూర్ (యూ)లో 6.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. అదేవిధంగా జిల్లాలోని గిన్నెదారిలో కూడా 6.5 డిగ్రీలు రికార్డయ్యాయి. సంగారెడ్డి జిల్లాలోని కోహిర్లో 6.9, ఆదిలాబాద్ జిల్లాలోని బేలలో 7.1 డిగ్రీలు, ఆర్లీలో 7.2 డిగ్రీల చొప్పున నమోదయింది. వికారాబాద్ జిల్లా మోరీన్పేటలో 7.3, సంగారెడ్డి జిల్లా ఆల్గోల్లో 7.6, న్యాల్కల్లో 7.7 డిగ్రీలు, కుమ్రం భీమ్ జిల్లా తిర్యానీలో 7.9, కామారెడ్డి జిల్లాలోని డోంగ్లిలో 8.0, రామ్నగర్ (ఆదిలాబాద్), చందన్వల్లి (రంగారెడ్డి), నల్లవల్లి (సంగారెడ్డి)లో 8.1, పెంబీ (నిర్మల్), తలమడుగు (ఆదిలాబాద్)లో 8.5, పొచ్చర (ఆదిలాబాద్), మర్పల్లె (వికారాబాద్), అల్మయ్పేట్ (సంగారెడ్డి)లో 8.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.
ఇక హైదరాబాద్లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అత్యంత కనిష్ఠంగా హెచ్సీయూలో 8.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బీహెచ్ఈఎల్ వద్ద 8.8, రాజేంద్రనగర్లో 9.4, మౌలాలీఓ 9.6, శివరామ్పల్లిలో 10.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. దీంతో ప్రజలు చలికి వణికిపోయారు. శుక్రవారం రాత్రి కూడా ఇలాగే ఉంటుందని, ఉష్ణోగ్రతలు అతి తక్కువకు పడిపోతాయని వాతావరణ శాఖ తెలిపింది.
CRAZY COLD WEATHER grips Telangana as 3rd spell of coldwave going strong now this season. Sirpur recorded 6.5°C lowest in Telangana
Hyderabad too under serious chill with few parts like UoH and BHEL recorded 8.8°C. Further drop in temp expected tonight 🥶🥶 pic.twitter.com/BLWWnj1WZ9
— Telangana Weatherman (@balaji25_t) January 3, 2025