నల్లగొండ : నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలో(,Narkatpally) దొంగలు బీభత్సం సృష్టించారు. పలు ఇండ్లలో దోపిడీలకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే..నార్కట్‌పల్లిలోని సన్ షైన్ కాలనీలో వరుసగా పది ఇండ్లలో చొరబడిన దుండగులు(Thieves) అందిన కాడికి దోచుకున్నారు. సుమారు రూ.2 లక్షల నగదు, 4 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
ఇది అంతర్ రాష్ట్ర ముఠా పనిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఘటనపై సమాచారం ఇచ్చినా పోలీసులు దర్యాప్తు మొదలెట్టలేదని బాధితుల ఆరోపించారు. వెంటనే నిందితులను పట్టుకొని న్యాయం చేయాలన్నారు. కాగా, వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.