KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సీఎం రేవంత్‌రెడ్డి తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి వెళ్తున్నారు. ఇవాళ ఢిల్లీకి బయలుదేరనున్న కేటీఆర్.. ఇప్పటికే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అప్పాయింట్మెంట్ తీసుకున్నారు. అమృత్ పథకం టెండర్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కేటీఆర్ కేంద్రమంత్రికి ఫిర్యాదు చేయనున్నారు.
అమృత్ పథకం టెండర్లలో సీఎం తన బావమరది సృజన్‌రెడ్డికి లాభం చేకూర్చేలా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని కేటీఆర్ ఇప్పటికే లేఖ ద్వారా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు ఆయనను నేరుగా కలిసి ఈ విషయంపై ఫిర్యాదు చేయాలని కేటీఆర్ నిర్ణయించుకున్నారు. ఇవాళ ఢిల్లీ వెళ్లనున్న కేటీఆర్ రెండు రోజులపాటు ఢిల్లీలోనే ఉండనున్నారు.