Joe Biden | నిత్యం తడబాట్లు, మతిమరుపు కారణంగా హెడ్‌లైన్స్‌లో నిలిచిన అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden).. మరోసారి అదే కారణంతో వార్తల్లో నిలిచారు. బీచ్‌లో ఇసుక దిబ్బలపై (sandy beach) నడిచేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది.
81 ఏళ్ల బైడెన్ ఫస్ట్ లేడీ జిల్‌తో కలిసి ఆదివారం డెలావేర్ (Delaware)లోని తన ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ బీచ్‌లో ఇద్దరూ కలిసి నడుస్తూ కనిపించారు. ఆ సమయంలో బైడెన్ ఇసుకపై నడిచేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. స్టడీగా నడవలేకపోయారు. ఒకానొక సమయంలో అధ్యక్షుడు కింద పడిపోబోతుంటే.. జిల్ బైడెన్ (Jill Biden) ఆయన చేతిని పట్టుకుని సాయం అందించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Trump called 70+ leaders last week. This is what our current president is doing:
— End Wokeness (@EndWokeness) November 10, 2024
Also Read..
Donald Trump | మనవరాళ్లతో కలిసి గోల్ఫ్ ఆడిన ట్రంప్.. అంకుల్ అయిన మస్క్
Cargo Corridor | ఆటోమేటెడ్ కన్వేయర్ బెల్ట్ రోడ్.. అబ్బురపరిచేలా కార్గో కారిడార్!