Donald Trump | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రికార్డు విజయం సాధించిన విషయం తెలిసిందే. రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలోకి దిగిన ట్రంప్.. అంచనాలను తలకిందలు చేస్తూ తన ప్రత్యర్థి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌పై ఘన విజయం సాధించారు. ఆదేశ 132 ఏండ్ల చరిత్రలో నాలుగేండ్ల విరామం తర్వాత తిరిగి ప్రెసిడెంట్ కాబోతున్న రెండో వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఇక వచ్చే ఏడాది జనవరి 20న ట్రంప్ అధ్యక్షడిగా శ్వేతసౌధంలో అడుగుపెట్టబోతున్నారు. ఈ విక్టరీని ట్రంప్ ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం తాజాగా ట్రంప్.. తన మనవరాళ్లతో సరదాగా గడిపారు.
Sundays with Grandpa 💛 pic.twitter.com/UfKdu0RJI7
— Kai Trump (@KaiTrumpGolfs) November 10, 2024
ఆదివారం మధ్యాహ్నం ఫ్లోరిడా గోల్ఫ్ క్లబ్లో మనవరాళ్లు కై ట్రంప్, ఛోలె ట్రంప్‌తో కలిసి గోల్ఫ్ ఆడారు (Trump golfs with granddaughters). అదే సమయంలో అక్కడికి టెస్లా బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) స్పెషల్ గెస్ట్‌గా వచ్చారు. తన నాలుగేళ్ల కుమారుడితో కలిసి ట్రంప్ ఫ్యామిలీతో చేరారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కై ట్రంప్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ‘సండేరోజు తాతయ్యతో’ అంటూ ట్రంప్‌తో ఉన్న ఫొటోను పంచుకుంది. ఈ సందర్భంగా మస్క్‌తో ఉన్న ఫొటోను కూడా షేర్ చేస్తూ.. ‘మస్క్ అంకుల్ అయ్యారు’ అంటూ టెస్లా బాస్‌కు స్పెషల్ స్టేటస్ (uncle status) ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
Elon achieving uncle status 😂 pic.twitter.com/vufSffziZN
— Kai Trump (@KaiTrumpGolfs) November 10, 2024
కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపుకై మస్క్ తీవ్రంగా కృషి చేసిన విషయం తెలిసిందే. భారీగా విరాళాలు ఇవ్వడమే కాకుండా.. ట్రంప్‌తో కలిసి ప్రచారాల్లో పాల్గొన్నారు. ఓటర్లను ఉత్సాహపరిచారు. ట్రంప్‌ను గెలిపించేందుకు ఈ టెక్ దిగ్గజం చేసిన హంగామా ఈసారి ఎన్నికల హైలైట్‌గా నిలిచింది. గెలుపు అనంతరం గత వారం తన ఫ్యామిలీతో ట్రంప్ సెలబ్రేషన్స్ చేసుకున్న విషయం తెలిసిందే. ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో క్లబ్లో ఎన్నికల నైట్ పార్టీలో ట్రంప్ ఫ్యామిలీ మొత్తం ఒకచోట చేరి సంబరాలు చేసుకుంది. ఈ విక్టరీ సెలబ్రేషన్స్‌లో కూడా ఎలాన్ మస్క్ చేరి సందడి చేశారు. తన నాలుగేళ్ల కుమారుడితో.. ట్రంప్ ఫ్యామిలీతో ఫొటోలకు ఫోజులిచ్చారు (Musk in Trump familys victory photo). ఆ ఫొటో కూడా నెట్టింట వైరల్ అవుతోంది.
The whole squad pic.twitter.com/5yQVkFiney
— Kai Trump (@KaiTrumpGolfs) November 6, 2024
Also Read..
Siddaramaiah | ఆ ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. ప్రధాని మోదీకి కర్ణాటక సీఎం సవాల్
Justice Sanjiv Khanna | సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా