PV Sindhu : పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావంతో దుబాయ్‌లో చిక్కుకుపోయిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu) కీలక టోర్నీకి దూరం కానుంది. ఇరాన్ క్షిపణుల దాడులతో వణికిపోతున్న దుబాయ్‌కు విమాన రాకపోకలు నిలిచిపోయన నేపథ్యంలో ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్షిప్(All England Championship) టోర్నమెంట్లో సింధు ఆడడంపై సందేహాలు నెలకొలన్నాయి. ఈ ఏడాదైన టైటిల్లో మురవాలనుకున్న తెలుగు తేజం కలలు కల్లలయ్యేలా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో భారత బృందానికి లక్ష్య సేన్ సారథ్యం వహించే అవకాశముంది.
బ్యాడ్మింటన్ ఆటలో ఆల్ ఇంగ్లండ్ టోర్నమెంట్ చాలా ప్రసిద్ధి. ఈసారి బర్మింగ్హమ్ వేదికగా మార్చి 3వ తేదీ నుంచి ఈ సూపర్ 1000 టోర్నీ ప్రారంభమవ్వనుంది. మంగళవారం నుంచే ఈవెంట్ షురూ కానున్నందున భారత బృందంలోని పలువురు ఇంగ్లండ్ చేరుకున్నారు. పురుషుల సింగిల్స్ స్టార్ లక్ష్య సేన్, ఆయుష్ శెట్టి.. డబుల్స్ ద్వయం సాత్విక్ – చిరాగ్.. మిక్స్డ్ డబుల్స్ ప్లేయర్లు ధ్రువ్ కపిల, తనీశ క్రాస్టో.. రోహన్ కపూర్, రుత్వికా శివాని గడ్డెలు కొందరు ఇతర మార్గాల్లో(ఆఫ్రికా, సింగపూర్ మీదుగా) బర్మింగ్హమ్లో దిగారు. సింధు మాత్రం కోచ్ ఇర్వన్స్యాహ్ అది ప్రటమాన్ సహా దుబాయ్‌లో చిక్కుకుపోయింది.
VIDEO | Indian badminton star PV Sindhu (@Pvsindhu1) says, “Hi everyone, I wanted to share a quick update and firstly thank you all who have been reaching out and checking on us. I was transiting from Bengaluru, where I train and live full-time now, to Birmingham in the UK to… pic.twitter.com/a4YPbrtV0u
— Press Trust of India (@PTI_News) March 1, 2026
గల్ఫ్‌లో యుద్ధం తీవ్రతతో నెలకొలన్న పరిస్థితుల వల్ల తాము సురక్షిత ప్రదేశంలో ఉన్నామని, ఇక్కడ భయానక పరిస్థితులు ఉన్నాయని ఆమె ఎక్స్ పోస్ట్‌తో తాను దుబాయ్‌లోనే ఉండిపోయాననే విషయాన్ని పంచుకుంది. ఇరాన్ క్షిపణుల దాడుల కారణంగా దుబాయ్ గగనతలాన్ని మూసేయడంతో విమాన రాకపోకలు నిలిచిపోయాయి. దాంతో.. తెలుగు తేజం ఆల్ ఇంగ్లండ్ టోర్నమెంట్లో పాల్గొనేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లలేని పరిస్థితి.
ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య దుబాయ్‌లోని పరిస్థితులను క్షుణ్ణంగా గమనిస్తోంది. సింధు సహ అక్కడ చిక్కుకుపోయిన క్రీడాకారులను ఇతర మార్గాల్లో సురక్షింతగా తరలించేందుకు ప్రయత్నిస్తోంది. తొలి రౌండ్లో థాయ్‌లాండ్ షట్లర్ సుపానిద కటేథోంగ్తో సింధు తలపడాల్సింది. కానీ, ప్రస్తుతం తను టోర్నీ సమయానికి ఇంగ్లండ్ చేరకుంటుందా? అంటే.. ఔనని కచ్చితంగా చెప్పలేం.
Two-time Olympic medallist PV Sindhu’s participation at the All England Championships in Birmingham remains uncertain after being stranded in Dubai amid the US and Israeli bombing of Iran and the resultant airspace closure in the Gulf region.
Read: https://t.co/jOgyEpqcAM pic.twitter.com/XduMZ9eNXo
— Sportstar (@sportstarweb) March 2, 2026
ఇప్పటివరకూ ప్రకాశ్ పదుకొనే(1980లో), పుల్లెల గోపిచంద్(2001లో).. ఈ ఇద్దరు మాత్రమే ఆల్ ఇంగ్లండ్ టోర్నమెంట్లో ఛాంపియన్‌గా నిలిచారు. ఆ తర్వాత సైనా నెహ్వాల్(2015లో), లక్ష్య సేన్(2022లో) టైటిల్‌కు చేరువగా వచ్చినప్పటికీ రన్నరప్‌గా వెనుదిరిగారు.