Justice Sanjiv Khanna | సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తి (Chief Justice of India)గా జస్టిస్ సంజీవ్ ఖన్నా (Justice Sanjiv Khanna) సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) ఆయనతో ప్రమాణం చేయించారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీ కాలం నిన్నటితో ముగిసిన విషయం తెలిసిందే. దీంతో తదుపరి సీజేఐగా సంజీవ్ ఖన్నా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్ తదితరులు హాజరయ్యారు. కాగా, భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా (Justice Sanjiv Khanna) ఆరు నెలలు మాత్రమే ఉంటారు. ఆయన 2025 మే 13న పదవీ విరమణ చేస్తారు.
#WATCH | Delhi: President Droupadi Murmu administers the oath of Office of the Chief Justice of India to Sanjiv Khanna at Rashtrapati Bhavan. pic.twitter.com/tJmJ1U3DXv
— ANI (@ANI) November 11, 2024
పలు కీలక తీర్పుల్లో భాగస్వామి
న్యూఢిల్లీలో 1960, మే 14న జన్మించిన సంజీవ్ ఖన్నా ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన క్యాంపస్ లా సెంటర్లో న్యాయశాస్ర్తాన్ని చదివారు. ఢిల్లీ హైకోర్టులో 2005లో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2006లో శాశ్వత జడ్జి అయ్యారు. 2019, జనవరి 18న సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టు జడ్జిగా ఆయన పలు ప్రముఖ తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. ఎన్నికల బాండ్లను రద్దు చేయడం, ఈవీఎంలు విశ్వసనీయమైనవని ప్రకటించడం, 370 అధికరణ రద్దును సమర్థించడం, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం లాంటి కీలక తీర్పులు ఇచ్చిన ధర్మాసనాల్లో జస్టిస్ ఖన్నా భాగస్వామిగా ఉన్నారు.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi arrives at Rashtrapati Bhavan to attend the oath-taking ceremony of Sanjiv Khanna as the 51st Chief Justice of India. pic.twitter.com/wUaerQLcor
— ANI (@ANI) November 11, 2024
చంద్రచూడ్ తనదైన ముద్ర
రెండేండ్ల పాటు సీజీఐగా పనిచేసిన జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీ కాలం ఆదివారంతో ముగిసింది. అయోధ్య జన్మభూమి వివాదం, ఆర్టికల్ 370 రద్దు, స్వలింగ సంపర్కాన్ని నేరరహితం చేయడం వంటి తీర్పులలో భాగస్వామి కావడమే కాక, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 38 రాజ్యాంగ ధర్మాసనాలలో ప్రాతినిధ్యం వహించారు. సుప్రీంకోర్టులో 500కు పైగా తీర్పులు ఇచ్చారు. ఒక్క తీర్పులలోనే కాక, న్యాయ విభాగంలో పలు సంస్కరణలు ప్రవేశపెట్టి తనదైన ముద్ర వేశారు. ఇప్పటివరకు కళ్లకు గంతలతో ఉన్న న్యాయదేవత స్థానంలో ఒక చేతిలో త్రాసు, మరో చేతిలో రాజ్యాంగం చేతబట్టిన కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు.
Also Read..
America Visa | అమెరికా వీసా కోసం.. 500 రోజులు నిరీక్షించాల్సిందే!
Aviation Industry | 17 ఏండ్లలో 5 కనుమరుగు.. దేశంలో విమానయాన రంగం కుదుపులు
Maharashtra Elections | మహారాష్ట్ర ఎన్నికల్లో కాకరేపుతున్న ఫ్యామిలీ పోరు