America Visa | అమెరికా వీసా కోసం.. 500 రోజులు నిరీక్షించాల్సిందే!
విహారయాత్ర కోసమో లేక వ్యాపార పర్యటన కోసమో మీరు అమెరికా వెళ్లాలనుకుంటున్నారా? అందుకు అవసరమైన వీసా కోసం కోల్‌కతాలోని అమెరికా కాన్సులేట్ ద్వారా దరఖాస్తు చేసుకుంటున్నారా?
- భారీగా పెరిగిన అమెరికా వీసా వెయిటింగ్ టైమ్
- కోల్‌కతాలో 16 నెలలపాటు వేచి చూడాల్సిందే
- తర్వాతి స్థానాల్లో చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై
America Visa | న్యూఢిల్లీ, నవంబర్ 10: విహారయాత్ర కోసమో లేక వ్యాపార పర్యటన కోసమో మీరు అమెరికా వెళ్లాలనుకుంటున్నారా? అందుకు అవసరమైన వీసా కోసం కోల్‌కతాలోని అమెరికా కాన్సులేట్ ద్వారా దరఖాస్తు చేసుకుంటున్నారా? అయితే అపాయింట్మెంట్ కోసం కనీసం 16 నెలలపాటు వేచిచూసేందుకు మీరు సిద్ధం కావాల్సిందే. వీసా నిరీక్షణ సమయాలు విపరీతంగా పెరిగినందున ఆ మాత్రం నిరీక్షించక తప్పదు. ఈ వెయిటింగ్ టైమ్‌ను తగ్గించేందుకు గత ఏడాది కాలంగా అమెరికా పలు చర్యలు చేపట్టడంతో పరిస్థితి కొంత మేరకు మెరుగుపడింది.
ముఖ్యంగా నిరుడు భారతీయ దరఖాస్తుదారుల కోసం ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయిలో 14 లక్షల వీసాలను ప్రాసెస్ చేయడంతోపాటు విజిటర్ వీసా అపాయింట్మెంట్ టైమ్‌ను 75% మేరకు తగ్గించగలిగారు. అయినప్పటికీ అమెరికా వీసాల కోసం సుదీర్ఘ కాలంపాటు నిరీక్షించాల్సిన పరిస్థితి మళ్లీ తలెత్తింది. ప్రస్తుతం బీ1/బీ2 వీసాల కోసం భారత్‌లోని అమెరికా కాన్సులేట్లలో నిరీక్షణ సమయం ఒక్కో చోట ఒక్కో రకంగా ఉన్నది.
కోల్‌కతాలో అత్యధింగా 499 రోజులపాటు నిరీక్షించాల్సి వస్తుండగా.. చెన్నైలో 486 రోజులు, హైదరాబాద్‌లో 435 రోజులు, ఢిల్లీలో 432 రోజులు, ముంబై 427 రోజులు పడుతున్నది. ఒకవేళ మీరు థర్డ్ కంట్రీ నేషనల్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ పరిస్థితి దాదాపు ఇలాగే ఉంటుంది. అపాయింట్మెంట్ కోసం అబూధాబీలో 332 రోజులు, దుబాయ్‌లో 289 రోజులు వేచి ఉండాల్సి ఉంటుంది. స్వదేశంలో కాకుండా వేరే దేశంలోని అమెరికా కాన్సులేట్ నుంచి పొందే వీసాను థర్డ్ కంట్రీ నేషనల్ వీసా అంటారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Journalist Helle Lyng: కేంద్ర మంత్రి అమిత్‌షాకు వీడియో పోస్టు చేసిన నార్వే జర్నలిస్టు
Newborn baby | అప్పుడే పుట్టిన పసికందును రోడ్డుపై పడేసిన దుండగులు.. మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు
Drinking water | గుక్కెడు నీటి కోసం గుండెలవిసే ఆవేదన ..తాగునీటి కోసం రోడ్డెక్కిన జనం
గుడిసెలో ఆకస్మాత్తుగా చెలరేగిన మంటలు.. సకాలంలో స్పందించిన పోలీసులు, 108 సిబ్బంది
Jailer 2 | ఓటీటీలోకి వచ్చేసిన రజనీకాంత్ ‘జైలర్ 2’.. కాని ఆ విషయంలో అభిమానులకు బిగ్ షాక్.. !
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

