Aviation Industry | 17 ఏండ్లలో 5 కనుమరుగు.. దేశంలో విమానయాన రంగం కుదుపులు
దేశంలో విమానయాన రంగం కుదుపులకు లోనవుతున్నది. ఏకైక ఫుల్ సర్వీస్ క్యారియర్ (ఎఫ్ఎస్సీ)గా ఎయిరిండియా మాత్రమే మిగిలింది. 2007లో ఐదు ఎఫ్‌ఎస్‌సీలు ఉండేవి.
- భారత్‌లో ఏకైక ఎఫ్ఎస్సీ ఎయిరిండియా
Aviation Industry | న్యూఢిల్లీ: దేశంలో విమానయాన రంగం కుదుపులకు లోనవుతున్నది. ఏకైక ఫుల్ సర్వీస్ క్యారియర్ (ఎఫ్ఎస్సీ)గా ఎయిరిండియా మాత్రమే మిగిలింది. 2007లో ఐదు ఎఫ్‌ఎస్‌సీలు ఉండేవి. విలీనాలు, వైఫల్యాల వల్ల వీటి సంఖ్య ప్రస్తుతం ఒకటికి చేరింది. ఫుల్ సర్వీస్ క్యారియర్స్ ప్రయాణికులకు కల్పించే అదనపు సదుపాయాలకు ఛార్జీలను టికెట్ ధరలోనే కలుపుతాయి. అదే లో-కాస్ట్ క్యారియర్స్ టికెట్ ధరను తక్కువగా చూపించి, అదనపు సదుపాయాలకు అదనంగా వసూలు చేస్తాయి. విస్తారా ఎయిర్‌లైన్స్ సోమవారం ఎయిరిండియాలో విలీనమైంది. దీంతో ఎయిరిండియా మాత్రమే మన దేశంలో ఎఫ్‌ఎస్‌సీగా మిగిలింది.
ఒక్కొక్కటిగా తెరమరుగు..
2012లో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం మన దేశంలోని విమానయాన సంస్థల్లో 49 శాతం వాటాలను కొనడానికి విదేశీ ఎయిర్‌లైన్స్ సంస్థలకు అనుమతి ఇచ్చింది. గల్ఫ్ విమానయాన సంస్థ ఎతిహాద్ నుంచి 24 శాతం వాటాను ప్రస్తుతం మూతపడిన జెట్ ఎయిర్వేస్ కొనుగోలు చేసింది. అదేవిధంగా ఎయిర్ఏసియా, విస్తారా సంస్థలు ప్రారంభమయ్యాయి. విస్తారా గత పదేళ్లలో ఎఫ్‌ఎస్‌సీగా కార్యకలాపాలను ప్రారంభించిన ఏకైక విమానయాన సంస్థ. ఫుల్ సర్వీస్ క్యారియర్ అయిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ 2007లో ఎయిరిండియాలో విలీనమైంది. అప్పటి నుంచి కనీసం ఐదు ఎఫ్‌ఎస్‌సీలు మన దేశంలో ఉండేవి. కింగ్‌ఫిషర్ 2012లోనూ, ఎయిర్ సహారా 2019లోనూ తెరమరుగైపోయాయి. ఎఫ్ఎస్సీ అయిన జెట్ ఎయిర్వేస్ 25 ఏళ్లపాటు నడిచింది. ఆర్థిక ఒడుదొడుకుల కారణంగా 2019లో కుప్పకూలింది. దీనిని ప్రస్తుతం లిక్విడేషన్‌కు పెట్టారు. ఈ నెల 12 నుంచి ఇక ఎయిరిండియా మాత్రమే మన దేశంలో ఎఫ్‌ఎస్‌సీగా కార్యకలాపాలను నిర్వహిస్తుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

