Donald Trump | ఉక్రెయిన్ యుద్ధాన్ని విస్తరించొద్దు.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్లో మాట్లాడిన ట్రంప్
Donald Trump | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ( ladimir Putin)తో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది.
Donald Trump | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రికార్డు విజయం సాధించిన విషయం తెలిసిందే. రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలోకి దిగిన ట్రంప్.. అంచనాలను తలకిందలు చేస్తూ తన ప్రత్యర్థి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌పై ఘన విజయం సాధించారు. ఆదేశ 132 ఏండ్ల చరిత్రలో నాలుగేండ్ల విరామం తర్వాత తిరిగి ప్రెసిడెంట్ కాబోతున్న రెండో వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఇక వచ్చే ఏడాది జనవరి 20న ట్రంప్ అధ్యక్షడిగా శ్వేతసౌధంలో అడుగుపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో తాను చేసిన వాగ్దానాలను నెరవేర్చేందుకు ట్రంప్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia – Ukraine War)పై ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ( ladimir Putin) తో మాట్లాడినట్లు సమాచారం. ఎన్నికల ఫలితాల అనంతరం ట్రంప్.. పలువురు దేశాధినేతలతో ఫోన్లో సంభాషిస్తున్నారు. ఈ క్రమంలో గత గురువారం ఆయన రష్యా అధ్యక్షుడితో మాట్లాడినట్లు వాషింగ్టన్ పోస్ట్ (Washington Post) తెలిపింది. ఈ క్రమంలో ఇరువురు నేతల మధ్య ఉక్రెయిన్ యుద్ధం చర్చకు వచ్చినట్లు పేర్కొంది. ఉక్రెయిన్ యుద్ధాన్ని విస్తరించొద్దని పుతిన్‌ను ట్రంప్ కోరినట్లు వెల్లడించింది. ఐరోపాలో అమెరికా గణనీయమైన సైనిక ఉనికిని ట్రంప్ ఈ సందర్భంగా గుర్తు చేసినట్లు సదరు కథనం నివేదించింది. ఉక్రెయిన్ యుద్ధం గురించి పరస్పరం చర్చించి పరిష్కారాన్ని కనుగొందామని రష్యా అధినేతకు ట్రంప్ సూచించినట్లు అధికార వర్గాలను ఊటంకిస్తూ వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో వెల్లడించింది.
కాగా, తాను అధికారంలోకి వస్తే ఒక్క రోజులో ఉక్రెయిన్ – రష్యా యుద్ధాన్ని ముగిస్తానంటూ ఎన్నికల ప్రచారంలో ట్రంప్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఇటీవలే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో కూడా ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య యుద్ధం గురించి చర్చకు వచ్చింది. టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ సైతం ఈ సంభాషణలో పాల్గొన్నట్టు సమాచారం. ట్రంప్‌తో సంభాషణ అద్భుతంగా సాగిందని జెలెన్స్కీ అభివర్ణించారు. చర్చలు కొనసాగించడానికి, మా సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ట్రంప్ అంగీకరించారని చెప్పారు.
Also Read..
Justice Sanjiv Khanna | సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా
RGUKT | బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థిని బలవన్మరణం..
KTR | చేతకాని హామీలు ఇచ్చేదెందుకు.. అధికారంలోకి వచ్చాక చేతులెత్తేయడం ఎందుకు?: కేటీఆర్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

