బాసర: నిర్మల్ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీ (RGUKT)లో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. పీయూసీ సెకండియర్ చదువుతున్న స్వాతిప్రియ.. హాస్టల్ గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆమె స్వస్థలం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ అని, వ్యక్తి గత సమస్యలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
అయితే స్వాతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉన్నది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.