వరంగల్ : వరంగల్(Warangal) జిల్లాలో దొంగలు(Thieves) బీభత్సం సృష్టించారు. ఆలయాలే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడ్డారు. వర్ధన్నపేటలోని కోనారెడ్డి చెరువు వద్ద ఉన్న దుర్గమ్మ, పెద్దమ్మ ఆలయాల్లో (Temples) చోరీ పాల్పడ్డారు. దుండగులు అమ్మవారి నగలు అపరించుకుపోయారు. ఆలయాల్లోని హుండీలు పగులగొట్టి నగదు ఎత్తుకెళ్లారు. అలాగే ఆలయాల పక్కనే ఉన్న ఓ మిల్లులో కూడా నగదు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి విరాలు తెలియాల్సి ఉంది.