MLA Sanjay | రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 13వ స్థానానికి పడిపోయిన తెలంగాణ : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
MLA Sanjay | మనకు బ్రహ్మాండమైన టీఎస్ ఐపాస్ పాలసీ, ప్లాన్ ఉంది. అంత బ్రహ్మాండంగా నడిపించిన రాష్ట్రాన్ని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 13వ స్థానంలో నిలిచిందని బీఆర్ఎస్ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తెలిపారు.
MLA Sanjay | రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక నీతి ఆయోగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ ర్యాంకింగ్-2026లో తెలంగాణ 13వ స్థానానికి పడిపోయిందని బీఆర్ఎస్ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తెలిపారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో కేటీఆర్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు దేశంలోనే తెలంగాణ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తొమ్మిదినరేళ్లలో ఏ రోజు కూడా 3వ స్థానం నుంచి కిందికి దిగలేదు. ఏనాడు కూడా 1, 2, 3వ స్థానాల్లో ఉండేదన్నారు.
మన ప్లాన్ను, మన పాలసీని ఆంధ్రప్రదేశ్ ఎట్లాకాపీ కొట్టిందంటే ఆఖరి మనం రాసినవన్నీ కూడా ఆ రోజు కాపీ కొట్టేసింది. మనకు అంత బ్రహ్మాండమైన పాలసీ, ప్లాన్ ఉందన్నారు ఎమ్మెల్యే సంజయ్. అంత బ్రహ్మాండంగా నడిపించిన రాష్ట్రాన్ని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 13వ స్థానంలో నిలిచింది. దీని వల్ల వ్యాపారస్థులంతా పారిపోతున్నారు. కొత్తగా వ్యాపారేమీ రావడం లేదు. కొత్త ఇండస్ట్రీస్ ఏం రావు. నీతి ఆయోగ్ మొన్న కూడా మళ్లీ టీఎస్ ఐపాస్ అంత బ్రహ్మాండమైన సిస్టమ్ ఎక్కడా లేదని మళ్లీ పొగిడింది. టీఎస్ ఐపాస్ ఉన్నా కూడా మనం 13వ స్థానంలో ఉన్నామంటే ఒక్కసారి ఆలోచించాలన్నారు.
దేశంలోని వ్యాపారవేత్తలే కాదు.. ఆ రోజు ప్రపంచంలోని అందరు వ్యాపారవేత్తలు కూడా ఇంత బ్రహ్మాండమైన సింగిల్ విండో క్లియరెన్స్ పాలసీని మేమెక్కడా చూడలేదు. 15 రోజుల్లో మీకు అనుమతి వచ్చే పాలసీని మేమెక్కడా చూడలేదని అందరూ ప్రశంసించారు. 2026లో కూడా ఆనాడు కేటీఆర్, కేసీఆర్ చేసిన పాలసీల గురించి నీతి ఆయోగ్ మాట్లాడుతుందంటే మనవి ఎంత బ్రహ్మాండమైన పాలసీలో ఒక్కసారి ఆలోచన చేయాలన్నారు.
ఆ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఏ రోజుకూడా తెలంగాణ మూడవ స్థానం నుండి కిందికి దిగలేదన్నారు. కేటీఆర్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు తెచ్చిన టీఎస్-ఐపాస్ పాలసీ బ్రహ్మాండమైన పాలసీ అని ఇప్పటికీ నీతి ఆయోగ్ పొగుడుతుంది. అలాంటి పాలసీని పెట్టుకొని కూడా మనం 13వ స్థానానికి పడిపోయామంటే రేవంత్ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు.
రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక నీతి ఆయోగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ ర్యాంకింగ్లో తెలంగాణ 13వ స్థానానికి పడిపోయింది
కేసీఆర్ హయాంలో కేటీఆర్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు దేశంలోనే తెలంగాణ 1వ స్థానంలో ఉండేది
ఆ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఏ రోజుకూడా తెలంగాణ మూడవ స్థానం నుండి… pic.twitter.com/1IpPmSsSEj
— Telugu Scribe (@TeluguScribe) July 20, 2026
Read Also :
Hyundai | హ్యుందాయ్ చార్జింగ్ టెన్షన్స్కు చెక్.. అందుబాటులోకి మరిన్ని చార్జింగ్ పాయింట్లు
TTD | టీటీడీ విద్యాదాన ట్రస్టుకు రూ.కోటి విరాళం
Skin Health | చర్మం సురక్షితంగా, కాంతివంతంగా ఉండాలంటే.. వీటిని తీసుకోవాలి..
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

