తిరుమల : విజయవాడకు చెందిన అన్ బ్లిక్స్ క్లౌడ్ డేటా ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సీఈవో తిరుమల కుమార్ కనకమేడల సోమవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు ( TTD Vidyadana Truste) రూ.కోటి విరాళంగా అందించారు.ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథంకు విరాళం డీడీలను అందజేశారు.
తిరుమలలో 18 గంటల్లో సర్వదర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. ఆదివారం 90,956 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 33,046 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.05 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.