GHMC Labourer | పారిశుద్ధ్య కార్మికులను రాంకీ అనే ప్రైవేట్ సంస్థకు అప్పగించడాన్ని నిరసిస్తూ అసెంబ్లీ ముట్టడించిన చెత్త సేకరణ కార్మికులను అరెస్ట్ చేసిన పోలీసులు ఎల్బీ స్టేడియంలో నిర్బంధించారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కార్మికులు ప్రభుత్వ వైఖరిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఓ సీనియర్ జీహెచ్ఎంసీ కార్మికుడు మీడియాతో మాట్లాడుతూ.. రాంకీ సంస్థకు అప్పగించడం వల్ల మా బతుకులు రోడ్డు పాలైతున్నాయి..
అందుకే మేం ధర్నా చేస్తున్నాం. మా తాతలు, ముత్తాతల నుంచి ఏ రోజైనా ప్రభుత్వానికి సపోర్ట్ చేసుకుంటూ వచ్చినం. మా చిన్నతనం నుంచి తాత, ముత్తాతల నుంచి ఇదే పని చేసుకుంటూ వస్తున్నం. ప్రభుత్వం రిక్షాలు ఇచ్చింది.. మన కేసీఆర్ స్వచ్చ ఆటోలు ఇచ్చారు. ఈ రోజు సర్కార్ రాంకీ సంస్థకు ఇస్తుంది. మా వల్ల ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదు.. ప్రభుత్వానికి మేం సపోర్టే చేస్తున్నన్నాడు.
గవర్నమెంట్‌ను మేమేనాడు కూడా జీతాలు అడగలేదు. ఏనాడు బ్లౌజులు అడగలేదు.. మాస్కలు అడగలేదు.. కరోనా టైంలో కూడా మావాళ్లు వేల మంది చనిపోయారు.. మా పిల్లల కోసం ఇదే మురికి పని చేసుకుంటున్నం. ఈ రోజు రాంకీ సంస్థకు అప్పగిస్తమంటున్నరు.. మా ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ఊరుకోం. మా జీవనోపాధి కోల్పోతున్నప్పుడు మేమెందుకు ఊరుకుంటం. ప్రభుత్వం మమ్మల్ని సంప్రదించకుండా.. మాకు చెప్పకుండా వారి లబ్ధి కోసం చేస్తున్నరు. మేమిలా చేయాలనుకుంటున్నమని మా దగ్గరకు వచ్చి చెప్పి ప్రభుత్వానికి ఏవిధంగా సపోర్ట్ చేస్తరు అని అడగాలి.. కానీ మాకు ఎలాంటి సమాచారం లేకుండా వాళ్ల సొంత నిర్ణయాలు తీసుకొని రాంకీ సంస్థకు అప్పజెప్తాం.. మీరు దాని కింద పని చేయాలని అంటున్నరని ఆవేదన వ్యక్తం చేశాడు.
జీహెచ్ఎంసీ కార్మికులను ప్రైవేటీకరణ చేయడం వల్ల మా బతుకులు రోడ్ల పాలు అవుతుంది
పారిశుద్ధ్య కార్మికులను రాంకీ అనే ప్రైవేట్ సంస్థకు అప్పగించడాన్ని నిరసిస్తూ అసెంబ్లీ ముట్టడించిన చెత్త సేకరణ కార్మికులను అరెస్ట్ చేసిన ఎల్బీ స్టేడియంలో నిర్బంధించిన పోలీసులు
మా ప్రాణాలైనా అర్పిస్తాము… https://t.co/XCL0zQaiiN pic.twitter.com/kNnpo83Vuj
— Telugu Scribe (@TeluguScribe) September 13, 2026
Indonesia | 240 మందితో వెళ్తున్న పడవ ఇండోనేషియా తీరంలో గల్లంతు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Low-voltage | నిజాంపేటలో లోవోల్టేజీ సమస్యను పరిష్కరించాలని రైతుల ఆందోళన
Grade-1 Fatty Liver | గ్రేడ్-1 ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి, ఏం చేయాలి..?