Nobel Prize: మెదడు మిస్టరీపై స్టడీ.. ముగ్గురు శాస్త్రవేత్తలకు మెడిసిన్ నోబెల్
Nobel Prize: న్యూరో సైన్స్ వండర్స్ చేస్తోంది. మెదడులోని నర్వ్ స్టడీకి ఇప్పుడు నోబెల్ దక్కింది. డ్రీమ్స్ మిస్టరీని గుట్టు విప్పే ప్రయత్నం చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు వైద్య శాస్త్రంలో 2026 నోబెల్ బహుమతి దక్కింది. కార్ల్ డిసెరోత్, పీటర్ హేగ్మాన్, జార్జ్ నగేల్ .. ఆ అవార్డును పంచుకున్నారు.
స్టాక్‌హోమ్: వైద్యశాస్త్రంలో ఈ యేటి నోబెల్ బహుమతి(Nobel Prize)ని ప్రకటించారు. మెడిసన్‌లో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ దక్కింది. కార్ల్ డిసెరోత్, పీటర్ హేగ్మాన్, జార్జ్ నగేల్ .. 2026 మెడిసిన్ నోబెల్ బహుమతి గెలుచుకున్నారు. ఐయాన్ ఛానల్స్‌తో పాటు ఆప్టో జెనటిక్స్లో ఆ ముగ్గురు శాస్త్రేవేత్తలు కొత్త డిస్కవరీ చేసినట్లు నోబెల్ కమిటీ తన ప్రకటనలో పేర్కొన్నది. మెదడులో కలిగే ఆలోచనలు, జ్ఞపకాలు, భావోద్వేగాలు, ప్రవర్తనల గురించి పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. అయితే తాజాగా ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు ఆప్టోజెనటిక్స్లో కొత్త విషయాన్ని కొనుగొన్నారు. మెదడులో ఉన్న నాడీ కణాల స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్ యాక్టివిటీ గురించి ఈ శాస్త్రవేత్తలు తేల్చారు. అయితే వీళ్లు కనుగొన్న పద్ధతుల్లోనే వివిధ దేశాల్లోనూ ల్యాబ్‌ల్లో మెదడు మిస్టరీని స్టడీ చేస్తున్నట్లు నోబెల్ కమిటీ పేర్కొన్నది.
BREAKING NEWS
The 2026 #NobelPrize in Physiology or Medicine has been awarded to Karl Deisseroth, Peter Hegemann and Georg Nagel “for their discoveries concerning light-gated ion channels and optogenetics.” https://t.co/pkDDEBWtkz— The Nobel Prize (@NobelPrize) October 5, 2026
1901 నుంచి 116 మెడిసిన్ ప్రైజ్‌లను ప్రకటించారు. 232 మంది వ్యక్తులు మెడిసిన్‌లో ప్రైజ్ అందుకున్నారు. వైద్య శాస్త్రంలో నోబెల్ అందుకున్న అతిపిన్న వయస్కుడు ఫ్రెడ్రిక్ బ్యాటింగ్. 32 ఏళ్ల వయసులో అతను ఆ అవార్డు గెలిచాడు. అవార్డు అందుకున్న వృద్ధుడిగా పేటన్ రౌస్ ఉన్నారు. ఆయన 87 ఏళ్ల వయసులో మెడిసిన్ నోబెల్ అందుకున్నారు. వైద్యంలో నోబెల్ బహుమతిని ఏ ఒక్క శాస్త్రవేత్త కూడా రెండోసారి గెలుచుకోలేదు. స్టాక్‌హోమ్‌లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్లో మెడిసిన్ నోబెల్‌ను ప్రకటిస్తారు. ఈ ఏడాది నోబెల్ బహుమతుల ప్రైజ్‌మనీ 12 మిలియన్ల స్వీడిష్ క్రానర్లుగా నిర్ధారించారు.
అమెరికాలోని హోవార్డ్ హూగ్స్ మెడికల్ ఇన్స్టిట్యూట్ అండ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో కార్ల్ డీసరోత్, జర్మనీలోని హమ్‌బోల్డ్ యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్‌లో పీటర్ హెగ్మాన్, జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ వుర్జ్బర్లో జార్జ్ నగేల్ ప్రొఫెసర్లుగా చేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

