Skin Health | చర్మం సురక్షితంగా, కాంతివంతంగా ఉండాలంటే.. వీటిని తీసుకోవాలి..
చర్మం కాంతివంతంగా కనిపించాలంటే ఖరీదైన స్కిన్‌కేర్ ఉత్పత్తులు మాత్రమే సరిపోవు. బయట నుంచి చర్మ సంరక్షణ ఎంత ముఖ్యమో, లోపలి నుంచి సరైన పోషకాహారం కూడా అంతే అవసరం. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించడం ద్వారా చర్మానికి సహజమైన మెరుపు వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Skin Health | చర్మం కాంతివంతంగా కనిపించాలంటే ఖరీదైన స్కిన్‌కేర్ ఉత్పత్తులు మాత్రమే సరిపోవు. బయట నుంచి చర్మ సంరక్షణ ఎంత ముఖ్యమో, లోపలి నుంచి సరైన పోషకాహారం కూడా అంతే అవసరం. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించడం ద్వారా చర్మానికి సహజమైన మెరుపు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రోజువారీ ఆహారంలో కొన్ని పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను చేర్చడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంటుంది. మంచి చర్మం కోసం ఒక్కటే అద్భుతమైన ఆహారం అంటూ ఏదీ ఉండదని, ప్రతిరోజూ పాటించే చిన్నచిన్న ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లే దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. రోజూ బీట్రూట్ జ్యూస్ తాగడం చర్మానికి మేలు చేస్తుంది. బీట్రూట్లో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని హానికర పదార్థాలను తొలగించడంలో, రక్తప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి. దీంతో చర్మం కాంతివంతంగా కనిపించడమే కాకుండా మొటిమల సమస్య కూడా తగ్గే అవకాశం ఉంటుంది.
ఉసిరికాయ, వాల్ నట్స్..
ఉసిరికాయ కూడా చర్మ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన ఆహారం. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగి చర్మం బిగుతుగా ఉండేందుకు సహాయపడుతుంది. అలాగే నల్లని మచ్చలను తగ్గించడంలో, రక్తాన్ని శుద్ధి చేయడంలో దోహదపడి మొటిమలు, మచ్చలు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. వాల్‌నట్స్‌లో విటమిన్ ఇ, ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని వాపులను తగ్గించడంలో, చర్మాన్ని లోపలి నుంచి తేమగా ఉంచడంలో సహాయపడతాయి. ఫలితంగా చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది. శనగ మొలకల్లో ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి అవసరమైన పోషకాలను అందించి ఆరోగ్యవంతమైన, కాంతివంతమైన చర్మాన్ని పొందడంలో సహాయపడతాయి.
బెర్రీలు, మామిడి పండ్లు..
మామిడి పండులో విటమిన్ ఎ, సి అధికంగా ఉంటాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో, నల్లని మచ్చలను తగ్గించడంలో, చర్మ కణాల మరమ్మత్తుకు తోడ్పడటంలో సహాయపడతాయి. దీంతో చర్మం మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అప్పుడప్పుడు బెర్రీ స్మూతీలు, పుచ్చకాయ రసం, ఉప్పు వేరుశెనగలు, చీజ్ స్లైసులు, కుల్ఫీ వంటి వాటిని కూడా పరిమితంగా తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొన్ని ఆహారాలను వీలైనంత వరకు దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్యాకెట్ జ్యూస్‌లు, మద్యం, డీప్ ఫ్రైడ్ నమకీన్, సోయా స్టిక్స్, పేస్ట్రీలు వంటి ఆహారాల్లో శుద్ధి చేసిన చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి చర్మంలోని తేమను తగ్గించడమే కాకుండా ఇన్సులిన్ స్థాయిలను పెంచి, కొల్లాజెన్ విచ్ఛిన్నానికి దారితీస్తాయి. ఫలితంగా చర్మం మసకబారడం, ముడతలు త్వరగా రావడం, వాపు, ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉండాలంటే ఒక్క ఆహారంపై ఆధారపడకుండా సమతుల ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, సరిపడా నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లను కూడా పాటించడం అవసరం. చిన్నచిన్న మంచి ఆహారపు ఎంపికలను ప్రతిరోజూ కొనసాగిస్తేనే దీర్ఘకాలంలో మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

