Telangana Talli | హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతి, అస్తిత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి దాడి చేసేందుకు సిద్ధమైంది. దాదాపు 60 ఏండ్ల పాటు తెలంగాణ ప్రాంతాన్ని నిలువెత్తునా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మరోసారి తెలంగాణ సంస్కృతిని రూపుమాపేందుకు కుట్రలు చేస్తోంది. అందుకు నిలువెత్తు నిదర్శనం.. నేటి రేవంత్ సర్కార్ రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహమే. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహ రూపం మొత్తాన్ని మార్చేశారు. తెలంగాణ సంస్కృతికి ఎంతో నిదర్శనమైన బతుకమ్మను లేకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ రూపొందించింది. దీంతో రేవంత్ సర్కార్‌పై తెలంగాణ మేధావి లోకం, కవులు, రచయితలు, కళాకారులు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరుగుతున్నారు.
బతుకమ్మ లేకుండా విగ్రహం తయారీ ఉద్దేశ్యమేంటి..? తెలంగాణ ఉద్యమంలో ఆడబిడ్డలను ఏకం చేసిన బతుకమ్మను లేకుండా ఎలా చేస్తారు..? తెలంగాణ సంస్కృతిలో ప్రధానమైనది బతుకమ్మ కాదా..? తెలంగాణ తల్లి విగ్రహం చేతులెత్తి మొక్కేలా ఉండాలా..? లేక ఓ సాధారణ ప్రతిమలా ఉండాలా..? దైవత్వం ఉట్టిపడే తెలంగాణ తల్లి విగ్రహానికి చేయి గుర్తు తల్లి విగ్రహం ప్రత్యామ్నాయమా..? రేవంత్‌కు సోయిలేకపోతే మంత్రులకు, నేతల కన్నా సోయి లేదా..? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేధావులు ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ తల్లి కాదు.. చేతి గుర్తు ప్రచారకర్తలా ఉందని మేధావులు, రచయితలు ధ్వజమెత్తుతున్నారు. గుండెల్లో లేని తెలంగాణ తనం గద్దెనెక్కితే వస్తదా.. అని మండిపడుతున్నారు. మరోసారి సీఎం రేవంత్ రెడ్డి తన అక్కసును బయటపెట్టుకున్నారని నిప్పులు చెరుగుతున్నారు. తెలంగాణ తల్లి అస్తిత్వాన్ని రూపు మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేశారు. చేతి గుర్తు తల్లిగా విగ్రహ తయారీ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యకర్తలా విగ్రహం ఉంది. దేవతారూపం లేకుండా కాంగ్రెస్ కార్యకర్తగా చేయి గుర్తు తల్లి.. పార్టీ రంగులు, అలంకరణలు, చేతి గుర్తును ప్రమోట్ చేసేలా డిజైన్ ఉందంటూ మేధావులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | ఎంత అవమానం.. రాహుల్ గాంధీ జీ..? కేటీఆర్
KTR | ఇది దళితుల మీద కక్ష్యా..? మహనీయులు అంబేద్కర్ మీద వివక్షా..? : కేటీఆర్