KTR | హైదరాబాద్ : ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహానీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడాన్ని బీఆర్ఎస్ పార్టీ తప్పుబట్టింది. అంబేద్కర్ విగ్రహానికి కనీసం నివాళులర్పించకుండా నిమ్మకు నీరెత్తినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు.
రాహుల్ గాంధీ జీ.. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను అవమానించాలని మీరేమైనా మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి, మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏంటో ఈ చిత్రం చూస్తే తెలిసిపోతుందన్నారు. కేసీఆర్ హాయాంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించి, జయంతి, వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించామని కేటీఆర్ తెలిపారు. కానీ మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంబేద్కర్‌కు కనీసం నివాళులర్పించకుండా అవమానించారని మండిపడ్డారు. మీ ప్రభుత్వం అంబేద్కర్‌ను ఎలా నిర్లక్ష్యం చేస్తుందో అనడానికి ఈ ఘటన నిదర్శనం అని పేర్కొన్నారు. ఎంత అవమానం రాహుల్ గాంధీ జీ అని కేటీఆర్ పేర్కొన్నారు.
Have you explicitly instructed your Govt to insult Dr. Babasaheb Ambedkar @RahulGandhi Ji?
Please see the stark difference between how BRS Govt installed & celebrated the world’s largest 125FT statue of Ambedkar Ji and how your Congress Govt continues to neglect his legacy &… pic.twitter.com/n6Lw4qFOf6
— KTR (@KTRBRS) December 6, 2024
ఇవి కూడా చదవండి..
KTR | ఇది దళితుల మీద కక్ష్యా..? మహనీయులు అంబేద్కర్ మీద వివక్షా..? : కేటీఆర్
KTR | కాంగ్రెస్ నిర్బంధిస్తున్నది బీఆర్ఎస్ నేతలను కాదు.. అంబేద్కర్‌ని: కేటీఆర్
KCR | సమ సమాజ నిర్మాణ దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్: కేసీఆర్