KTR | హైదరాబాద్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టించిన అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించకుండా నిర్భంధిస్తారా..? అని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇది దళితుల మీద కక్ష్యా..? మహనీయులు అంబేద్కర్ మీద వివక్షా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు వెళ్తున్న పలువురు బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ సర్కార్ గృహ నిర్బంధం చేసిన సంగతి తెలిసిందే. ఈ హౌజ్ అరెస్టులపై కేటీఆర్ఎస్ ఎక్స్ వేదికగా స్పందించారు.
రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరుగుతాడు. ఆ రాజ్యాంగం రచించిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని కేసీఆర్ గౌరవంగా తెలంగాణ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన సగౌరవంగా ప్రతిష్టించారు. అదే రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన సీఎం రేవంత్ కనీసం మహనీయుడు అంబేద్కర్ జయంతి, వర్ధంతులకు కనీసం దండేసి, దండంపెట్టి స్మరించుకునే అవకాశం ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ హయాంలో నిర్మించిన సచివాలయంలో, పోలీస్ కంట్రోల్ రూమ్లో సమీక్షలు చేస్తారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ నిర్మించిన ఫ్లై ఓవర్లను, యాదాద్రి పవర్ ప్లాంట్ను ప్రారంభిస్తూ.. కేసీఆర్ ప్రతిష్టించిన అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించకుండా నిర్భంధిస్తారా..? అని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇది దళితుల మీద కక్ష్యా..? మహనీయులు అంబేద్కర్ మీద వివక్షనా..? అని కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చివరకు జాగో తెలంగాణ జాగో అని కేటీఆర్ పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరుగుతాడు
ఆ రాజ్యాంగం రచించిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని కేసీఆర్ గారు గౌరవంగా తెలంగాణ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన సగౌరవంగా ప్రతిష్టించారు
అదే రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన సీఎం రేవంత్ కనీసం మహనీయుడు… pic.twitter.com/NOkd9Tiigg
— KTR (@KTRBRS) December 6, 2024
ఇవి కూడా చదవండి..
KTR | కాంగ్రెస్ నిర్బంధిస్తున్నది బీఆర్ఎస్ నేతలను కాదు.. అంబేద్కర్ని: కేటీఆర్
KCR | సమ సమాజ నిర్మాణ దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్: కేసీఆర్