KTR | ఇదీ తెలంగాణ చరిత్రపైన కేసీఆర్ చేసిన చెరగని మరో సంతకం.. యాదాద్రి పవర్ స్టేషన్‌పై కేటీఆర్ ట్వీట్
KTR | నల్లగొండ జిల్లా యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (YTPS) ప్రారంభానికి సిద్ధమైంది. ఈ పవర్ స్టేషన్‌ను శనివారం జాతికి అంకితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇదీ తెలంగాణ చరిత్రపైన కేసీఆర్ చేసిన చెరగని మరో సంతకం అని పేర్కొంటూ వైటీపీఎస్పై కేటీఆర్ ట్వీట్ చేశారు.
KTR | హైదరాబాద్ : నల్లగొండ జిల్లా యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (YTPS) ప్రారంభానికి సిద్ధమైంది. ఈ పవర్ స్టేషన్‌ను శనివారం జాతికి అంకితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇదీ తెలంగాణ చరిత్రపైన కేసీఆర్ చేసిన చెరగని మరో సంతకం అని పేర్కొంటూ వైటీపీఎస్పై కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఇదీ కేసీఆర్ ఆనవాళ్లు..! నల్గొండ జిల్లాలో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (YTPS) రేపు ప్రారంభమవుతున్న సందర్భంలో ఈ పవర్ ప్లాంట్ నిర్మాణం వెనక ఉన్న కేసీఆర్ దార్శనికత, కృషి తెలంగాణ ప్రజలకు చిరకాలం గుర్తుంటుంది అని కేటీఆర్ పేర్కొన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ కేసీఆర్ దీర్ఘ దృష్టికి, భారీ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో అనితరసాధ్యమైన వేగానికి మరొక ఉదాహరణ అని కొనియాడారు.
వైటీపీఎస్ పూర్తి సామర్థ్యం 4000 మెగావాట్లు (5×800).. స్వతంత్య్ర భారత చరిత్రలోనే ఒక రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ఉన్న అతిపెద్ద థర్మల్ పవర్ ప్లాంట్ ఇదే అని కేటీఆర్ తెలిపారు. వైటీపీఎస్ నిర్మాణాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం బీహెచ్ఈఎల్కు అప్పగించింది. దాదాపు రూ.20,400 కోట్లు విలువైన ఆర్డర్, భారత విద్యుత్ రంగ చరిత్రలో ఒక ప్రభుత్వ రంగ సంస్థకు ఇవ్వబడిన అత్యంత విలువైన ఆర్డర్‌గా నిలిచిందని కేటీఆర్ పేర్కొన్నారు.
నిత్య కరెంట్ కోతలు, వారానికి రెండు రోజుల పవర్ హాలీడేల దుస్థితి నుంచి అన్ని రంగాలకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేసేలా తెలంగాణను తీర్చిదిద్దిన కేసీఆర్ దార్శనితకలో ఒక భాగమే యాదాద్రి పవర్ ప్లాంట్. 2014లో కేవలం 7778 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం మాత్రమే ఉండగా, బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ద కాలంలో తెలంగాణలో స్థాపిత సామర్థ్యాన్ని దాదాపు 20,000 మెగావాట్లకు చేరుకొనేలా చేసింది.. ఇది దేశ చరిత్రలో ఎన్నడూ చూడని విజయగాథ అని కేటీఆర్ ప్రశంసించారు.
ఇదీ కేసీఅర్ అనవాలు!
నల్గొండ జిల్లా యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (YTPS) రేపు ప్రారంభమవుతున్న సందర్భంలో ఈ పవర్ ప్లాంట్ నిర్మాణం వెనక ఉన్న కేసీఆర్ గారి దార్శనికత, కృషి తెలంగాణ ప్రజలకు చిరకాలం గుర్తుంటుంది.
⚡⚡ యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ కేసిఆర్ గారి దీర్ఘ దృష్టికి, భారీ… pic.twitter.com/KAXIWwsL3g
— KTR (@KTRBRS) December 6, 2024
ఇవి కూడా చదవండి..
KTR | ఎంత అవమానం.. రాహుల్ గాంధీ జీ..? కేటీఆర్
KTR | ఇది దళితుల మీద కక్ష్యా..? మహనీయులు అంబేద్కర్ మీద వివక్షా..? : కేటీఆర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS Govt
- CM Revanth Reddy
- KCR
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
Officials Negligence | అధికారుల నిర్లక్ష్యం..వృథాగా పోతున్న భగీరథ నీళ్లు
Tirumala | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..హుండీకి రూ. 4.01 కోట్లు ఆదాయం
Students cry | మమ్మల్ని విడిచి వెళ్లకండి సార్ అంటూ.. కంటతడి పెట్టుకున్న విద్యార్థులు : వీడియో
Janhvi Kapoor | ఇండస్ట్రీలోకి రాకముందే ముక్కుకు సర్జరీ చేయించుకున్నా.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన జాన్వీ కపూర్!
Retirement | ఉద్యోగ విరమణ అనంతరం చాలా మంది చేయాల్సిన పనులు ఇవే.. ఆరోగ్యంగా ఉండవచ్చు..
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

