HYDRAA | హైదరాబాద్ : అమీన్పూర్ చెరువుకు సంబంధించిన కేసు విషయంలో విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు నోటీసులు జారీ చేసింది. హైడ్రా కమిషనర్ సోమవారం విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అమీన్పూర్ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని ఇటీవల ఓ భవనాన్ని హైడ్రా సిబ్బంది కూల్చేశారు. అయితే కోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని చెప్పినా పట్టించుకోకుండా కూల్చేశారని బాధితుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైడ్రా కమిషనర్ వివరణ ఇవ్వాలని కోర్టు సూచించింది. నేరుగా లేదా ఆన్లైన్ విచారణకు హాజరు కావాలని హైడ్రా కమిషనర్‌ను కోర్టు ఆదేశించింది.
ఇవి కూడా చదవండి..
Harish Rao | ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి.. హరీశ్‌రావు తీవ్ర విమర్శలు
Musi River | మూసీ నిర్వాసితుల తరలింపునకు ప్రత్యేక సిబ్బంది.. జీహెచ్ఎంసీ ఉత్తర్వులు