Musi River | హైదరాబాద్ : మూసీ నది ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. స్థానికుల ఆవేదనను పట్టించుకోని ప్రభుత్వం.. వారిని అక్కడ్నుంచి బలవంతంగా పంపించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. మూసీ నిర్వాసితులను మరో ప్రాంతానికి తరలించేందుకు 14 మంది హౌసింగ్ సిబ్బందిని నియమిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఉత్తర్వులు జారీ చేశారు.
పిల్లిగుడిసెలు, జంగమ్మెట్, ప్రతాపసింగారం, సాయిచరణ్ కాలనీ, కమలానగర్, కొల్లూరు-1, గాంధీనగర్, జై భవానీ నగర్, తిమ్మాయిగూడ, నార్సింగి, బండ్లగూడ, డి పోచంపల్లి-2, బాచుపల్లిలో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లకు నిర్వాసితులను తరలించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.
ఇవి కూడా చదవండి..
Hyderabad | హైదరాబాద్లో పోస్టర్లు, బ్యానర్లు, కటౌట్లపై నిషేధం
Musi River | రేవంత్ రెడ్డి మీ తాత జాగీర్ లెక్క పేదల ఇళ్లు కూలగొడితే చూస్తూ ఊరుకోం : ఎంపీ ఈటల
President visit | రేపు నగరానికి రాష్ట్రపతి.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు