హైదరాబాద్ : పేదల జీవితాలను ఫణంగా పెడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిజాం సర్కార్ కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Etala Rajender) మండిపడ్డారు. మూసీ పరివాక(Musi River) ప్రాంతంలో ఆయన పర్యటించి మాట్లాడారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లను కూల్చేస్తున్నారు. నోటీసులు పంపుతూ సామాన్య ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. హైడ్రా పేరు చెప్పి పేదలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తురని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నువ్వు అనుకుంటున్నావ్. మీ తాత జాగీర్ లెక్క పేదల ఇళ్లు కూలగొడితే, పేదల బతుకుల్లో మట్టి కొడితే ఏమి కాదనుకోకు. బాధితులు ఇప్పుడు శాపనార్ధాలు పెడుతున్నారు. సంద ర్భం, సమయం వస్తే నీ అధికారం ఏందో, నువ్వేందో అంతు తేల్చేవరకు ప్రజలు వదిలిపెట్టరని హెచ్చరించారు. బాధితులకు అండగా ఉంటామని హామీనిచ్చారు.