ఖమ్మం కమాన్‌బజార్, మార్చి 13: రాష్ట్రంలోని భూదాన్ భూములపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్ చేశారు. ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో అర్హులకు ఇంటి పట్టాలు ఇవ్వాలని స్పష్టంచేశారు. శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. భూదాన్ బాధితుల పక్షాన వివిధ పార్టీలు, పలు సంఘాల చేసిన పోరాట ఫలితంగానే ప్రభుత్వం దిగి వచ్చి 311 మందికి ఇంటిపట్టాలు ఇచ్చిందని అన్నారు. అయినప్పటికీ బాధితుల్లో ఇంకా అర్హులు ఉన్నారని తెలిపారు. రీ సర్వే చేసి వారికి కూడా పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.