Musi River | హైదరాబాద్ : మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజల ఆమోదం తీసుకున్న తర్వాతనే ప్రక్షాళన చేపట్టాలి.. లేదు మేం బలవంతం చేస్తాం అంటే మాత్రం హైదరాబాద్ మరో అగ్నిగోళం అవుతుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్ రెడ్డి హెచ్చరించారు. మూసీ పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటున్న వారి వెంట కేసీఆర్ ఉన్నాడు.. మీరు ఎవరూ భయపడొద్దు.. బీఆర్ఎస్ పార్టీ వాళ్ల తరపున పోరాడుతుందని కార్తీక్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో కార్తీక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
మూసీ నదిపై ఆదిత్య నిర్మాణ సంస్థ నిర్మాణాలు చేస్తుంటే వాటిని ఆపకుండా, పేదలు.. సామాన్యులు ఉండే హైదర్షాకోట్ విలేజ్‌లో అధికారులు ఇండ్లకు మార్కింగ్ చేయడం జరిగింది. ఆదిత్య నిర్మాణ సంస్థ ప్రభుత్వ పెద్దల చేతులు తడిపింది అందుకే వారిని వదిలేశారు… చేతులు తడపని పేదల ఇండ్లపై హైడ్రాను వాడుతున్నారు. 2022లో ఆదిత్య నిర్మాణ సంస్థకి మా బీఆర్ఎస్ ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది, కానీ తర్వాత ఆ పర్మిషన్‌ని నిలుపుదల చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి ఆదిత్య నిర్మాణ సంస్థకు అక్కడ బిల్డింగ్ కట్టుకునేందుకు పర్మిషన్ ఇచ్చారని కార్తీక్ రెడ్డి తెలిపారు.
2400 కిలోమీటర్ల పొడవున్న నమామి గంగే ప్రాజెక్టుకి అయిన ఖర్చు రూ.40 వేల కోట్లు. అయితే గండిపేట నుంచి నాగోల్ వరకు 55 కిలోమీటర్లు విస్తీర్ణం కలిగి ఉన్న మూసీ నది సుందరీకరణకు అవుతున్న ఖర్చు రూ. లక్షా 50 వేల కోట్లు. ఇక మూసీ నది డీపీఆర్ కోసం రూ.1500 కోట్లు ఖర్చు చేయబోతుంది ఈ ప్రభుత్వం.. ప్రపంచంలో ఎక్కడైనా చూస్తామా డీపీఆర్ కోసం ఇంత ఖర్చు పెట్టడం..? అని పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ప్రశ్నించారు.
మూసీ సుందరీకరణ అనేది లక్షా అరవై వేల కోట్ల రూపాయల కుంభకోణం. ఆనాడు బీఆర్ఎస్ హయాంలో మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.16,000 కోట్లు. కానీ నేడు అదే మూసీ సుందరీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1,50,000 కోట్ల వ్యయం పెంచింది.. ఇది పెద్ద కుంభకోణం అని పటోళ్ల కార్తీక్ రెడ్డి స్పష్టం చేశారు.
మూసి పరివాహక ప్రాంతంలో ప్రజల ఆమోదం తీసుకున్న తర్వాతే మీరు ప్రాజెక్టులో ముందుకు పోవాలి
లేదు మేము బలవంతం చేస్తాం అంటే మాత్రం హైదరాబాద్ మరో అగ్ని గోళం అవుతుంది
మీ వెంట కేసీఆర్ ఉన్నాడు, మీరు ఎవరు భయపడవద్దు.. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ తరుపున నిల్చుంటుంది – పట్లోళ్ల కార్తీక్ రెడ్డి pic.twitter.com/SFOa36DBW9
— Telugu Scribe (@TeluguScribe) September 27, 2024
ఇవి కూడా చదవండి..
Harish Rao | ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి.. హరీశ్‌రావు తీవ్ర విమర్శలు
Musi River | మూసీ నిర్వాసితుల తరలింపునకు ప్రత్యేక సిబ్బంది.. జీహెచ్ఎంసీ ఉత్తర్వులు