Telangana | సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై ప్రత్యేకాధికారులతో సీఎస్ టెలీ కాన్ఫరెన్స్
Telangana | రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను విజయవంతంగా పూర్తి చేసేందుకు చిత్త శుద్దితో కృషిచేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు.
Telangana | హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను విజయవంతంగా పూర్తి చేసేందుకు చిత్త శుద్దితో కృషిచేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణపై గురువారం ప్రత్యేకాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సీఎస్ సమీక్షించారు.
ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా కూడా పాల్గొన్న ఈ టెలీ కాన్ఫరెన్స్లో సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ.. ఈ సర్వేకు సంబంధించి ఇంటింటి వివరాలను సేకరించి స్టిక్కరింగ్ చేసే ప్రక్రియ రేపటితో పూర్తవుతుందని, ఈ నెల 9 నుండి అసలు సర్వే మొదలవుతుందన్నారు. ఉమ్మడి జిల్లాలకు నియమితులైన ప్రత్యేకాధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి సర్వే జరుగుతున్న విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించడంతో పాటు జిల్లా కలెక్టర్లు, సర్వే నోడల్ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. సేకరించిన వివరాలను కంప్యూటరైజ్ చేయడానికి సుశిక్షితులైన డాటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
దేశంలోనే ప్రథమంగా చేపట్టిన ఈ ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియని రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. ఈ సర్వేలో ప్రతీ ఒక్క కుటుంబం పాల్గొనేలా ప్రతీ రోజూ ప్రజలను ఛైతన్యపర్చేలా విస్తృత ప్రచారం చేపట్టాలని తెలిపారు. ఏ ఇంటిని కూడా వదలకుండా పకడ్బందీగా నిర్వహించాలన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | జైలుకు వెళ్లేందుకు అభ్యంతరం ఏం లేదు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
KTR | మెగా కృష్ణారెడ్డి ఇంటి మీదకు ఏసీబీని పంపే దమ్ముందా..? రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
KTR | ఫార్ములా -ఈ రేస్ వల్ల జరిగే లాభం రేవంత్ రెడ్డికి తెలియదు.. మండిపడ్డ కేటీఆర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

