KTR | హైదరాబాద్ : మెగా కృష్ణారెడ్డి ఇంటి మీదకు ఏసీబీని పంపే దమ్ముందా..? అని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. నీవు మొగోనివే అయితే మెగా కృష్ణారెడ్డి కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
నన్ను ఏసీబీ విచారిస్తుందట.. ఏసీబీ ఫుల్ పామ్ తెలుసా రేవంత్ రెడ్డికి.. తెలుసనుకో.. బ్యాగులతో తిరిగినోడికి ఎందుకు తెల్వదు. ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో. ఏసీబీని కరప్షన్‌కు వ్యతిరేకంగా వాడాలి. ఇందులో కరప్షన్ ఏడుంది.. కాకరకాయ ఏడుంది. నేను అడుగుతున్నా చెప్పు. ఫార్ములా-ఈ రేస్ హైదరాబాద్‌లో ఉండాలని చెప్పి హెచ్ఎండీఏ నుంచి రూ. 55 కోట్లు పంపిన మాట వాస్తవం. దాంట్ల నేను ఏమైనా దాచుకుంటినా..? నాకు ఏమైనా వచ్చాయ..? అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఈ రేస్ రద్దుతో హైదరాబాద్‌కు నష్టం కలిగించినా రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టాలి. హైదరాబాద్ ఇమేజ్ దెబ్బ తీశావు. రేవంత్ రెడ్డిది తెలివితక్కువ నిర్ణయం. ఆగస్టు 25న నరికిండు రేవంత్ రెడ్డి.. 2036 ఒలిపింక్స్‌ను ఇక్కడికి తెస్తడట. ఎంత ఖర్చు అయితదో తెలుసా ఈ సీఎంకు. 2016 ఒలిపింక్స్‌కు రియోలో లక్షా 8 వేల కోట్లు, 2020లో టోక్యోలో 2.9 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. ఈ ఖర్చు మన బడ్జెట్ అంత. ఈ మొగోడు ఒలింపిక్స్ హైదరాబాద్‌లో పెడుతాడట. 50 కోట్లకే ఒర్రుతుండు. నీ ముఖానికి అయితదా..? అంతర్జాతీయ ప్రమాణాతో ఈవెంట్ నిర్వహించడం తెలుసా..? అని కేటీఆర్ నిప్పులు చెరిగారు.
చేతనైతే మెగా ఇంజినీరింగ్ మీద పెట్టు కేసు. సుంకిశాలలో గోడ కూలిపోయింది 80 కోట్లు నష్టం వచ్చింది. దమ్ముంటే బ్లాక్ లిస్ట్‌లో పెట్టి మెగా కృష్ణారెడ్డి ఇంటి మీదికి ఏసీబీని పంపు.. ఈస్టిండియా కంపెనీ అన్నావు కదా..? నీవు మొగోనివి అయితే పంపు.. ఏసీబీ కేసు పెట్టు. అవసరమైతే 50 లక్షలతో దొరికిన బ్యాగ్మెన్ మీద ఏసీబీ కేసు పెట్టాలి. ఇవాళ రేస్ రద్దు చేయడం కారణంగా జరిగిన నష్టానికి రేవంత్ మీద ఏసీబీ కేసు పెట్టాలి. మేం బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేశాం. మీరు బ్యాడ్ ఇమేజే క్రియేట్ చేస్తున్నాం. హైడ్రా పేరుతో విశ్వనగరం విజన్‌ను దెబ్బతీస్తున్నావ్ అని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి..
KTR | ఫార్ములా -ఈ రేస్ వల్ల జరిగే లాభం రేవంత్ రెడ్డికి తెలియదు.. మండిపడ్డ కేటీఆర్
KTR | ఫార్ములా-ఈ రేస్‌తో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది : కేటీఆర్
KTR | కామన్వెల్త్ గేమ్స్ అనగానే కాంగ్రెస్ కుంభకోణం గుర్తుకొస్తది : కేటీఆర్