Hindu girls attend iftar at college | కాలేజీ ఇఫ్తార్ విందులో పాల్గొన్న హిందూ విద్యార్థినులు.. ప్రాంగణాన్ని ‘శుద్ధి’ చేసిన వీహెచ్‌పీ కార్యకర్తలు
Hindu girls attend iftar at college | ఒక కాలేజీలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో హిందూ విద్యార్థినులు కూడా పాల్గొన్నారు. ఇది తెలుసుకున్న హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వీహెచ్‌పీ కార్యకర్తలు ఆ కాలేజీ ప్రాంగణాన్ని శుద్ధి చేశారు.
భోపాల్: ఒక కాలేజీలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో హిందూ విద్యార్థినులు కూడా పాల్గొన్నారు. ఇది తెలుసుకున్న హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వీహెచ్‌పీ కార్యకర్తలు ఆ కాలేజీ ప్రాంగణాన్ని శుద్ధి చేశారు. (Hindu girls attend iftar at college) మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ సంఘటన జరిగింది. మార్చి 11న భోపాల్‌లోని ఒక ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలో ఇఫ్తార్ విందు జరిగింది. ఆ కాలేజీకి చెందిన ముస్లిం విద్యార్థులు, సిబ్బంది ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో హిందూ విద్యార్థులు కూడా పాల్గొన్నారు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆ కాలేజీ గేట్ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. ఇఫ్తార్ కార్యక్రమంలో హిందూ యువతులు పాల్గొనడాన్ని తప్పుపట్టారు. ‘ఇస్లామీకరణ’ను ఆ కాలేజీ ప్రోత్సహిస్తున్నదని ఆరోపించారు. ఆ కాలేజీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు హనుమాన్ చాలీసా పఠించారు.
మరోవైపు కొంత మంది వీహెచ్‌పీ కార్యకర్తలు కాలేజీ క్యాంపస్‌లో గంగా జలం చల్లి ‘శుద్ధి’ ఆచారం నిర్వహించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో కాలేజీ యాజమాన్యం సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ ప్రాంతంలో ఆంక్షలు విధించారు.
అయితే క్యాంపస్‌లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడాన్ని కాలేజీ యాజమాన్యం సమర్థించింది. తమ విద్యా సంస్థ అన్ని మతాల పండుగలను జరుపుకుంటుందని తెలిపింది. ఇటీవల క్యాంపస్‌లో హోలీ కూడా జరుపుకున్నట్లు పేర్కొంది. మత సామరస్యంలో భాగంగా ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించినట్లు వెల్లడించింది.
मध्य प्रदेश –
भोपाल के एक कॉलेज में 11 मार्च को रोजा इफ्तार कार्यक्रम हुआ। सोशल मीडिया में Video वायरल हुई। आज हिंदू संगठनों ने कॉलेज गेट पर प्रोटेस्ट किया। हनुमान चालीसा का पाठ किया। गंगाजल से कॉलेज का शुद्धिकरण किया।
pic.twitter.com/yr6pRAcbr3— Sachin Gupta (@SachinGuptaUP) March 14, 2026
Also Read:
Teacher Beats Student Brutally | లెక్క తప్పుగా చేసినందుకు.. విద్యార్థినిని దారుణంగా కొట్టిన టీచర్
Wife Runs Away | భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. మరో వ్యక్తితో భార్య పరార్
Watch: సీఎం హెలికాప్టర్ ల్యాండ్‌కు ముందు హెలిప్యాడ్‌లోకి ఆవు.. ఏం జరిగిందంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

