KTR | హైదరాబాద్ : కామన్వెల్త్ గేమ్స్ అనగానే కాంగ్రెస్ కుంభకోణం గుర్తుకు వస్తదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కామన్వెల్త్ కుంభకోణంలో సురేశ్ కల్మాడి జైలుకు కూడా వెళ్లాడని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
ఈ మోటార్ కార్ల రేసింగ్ అనేది ఒక క్రీడ. కబడ్డీ, ఖోఖో, క్రికెట్ లాగే మోటార్ రేసింగ్ కూడా ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొందిన క్రీడ. ప్రపంచంలోనే తొలిసారిగా 1894లో కార్ల రేసింగ్ పారిస్‌లో జరిగింది. ఫార్ములా -1 మొదటి రేస్ 1946లో తొలిసారిగా ఇటలీ దేశంలో జరిగింది. ఎఫ్-1 రేస్‌ను ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిరు. ఈ రేస్ నిర్వహణ కోసం ప్రపంచ దేశాలు పోటీ పడుతాయి. దేశానికి ఫార్ములా -1 రావాలనే కల ఈనాటిది కాదు. రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు నాయుడు 28 సెప్టెంబర్ 2003లో అప్పటి ఎఫ్-1 సీఈవోను కలిసి మా రంగారెడ్డి జిల్లాలో పెట్టాలని కోరారు. రేవంత్ రెడ్డి గురువు కన్నకలను మేం నెరవేర్చాం. శిష్యుడు మాత్రం నెరవేర్చలేదు. చంద్రబాబు దాంతో ఆగలేదు. ఎఫ్-1 కండక్ట్ చేయడానికి గోపన్‌పల్లి ప్రాంతంలో 1500 ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు. చివరకు 400 ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చి డెడికేటెడ్ ట్రాక్ నిర్మించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఆ 400 ఎకరాల్లో కూడా రేవంత్ రెడ్డి భూమి ఉంది. భూసేకరణకు కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. మేం భూములు ఇవ్వమని రైతులు కోర్టుకు వెళ్లారు. ఆ కేసు ఇంకా నడుస్తోందని కేటీఆర్ తెలిపారు.
ఫార్ములా -1 రేష్ నిర్వహణ కోసం నాటి సీఎం చంద్రబాబు చొరవ తీసుకుని ఇటలీ వెళ్లి అడిగారు. 2004లో ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. యూపీఏ హయాంలో యూపీలో మాయావతి ప్రభుత్వం.. జేపీ(జయప్రకాశ్ గ్రూప్) గ్రూప్ వాళ్లతో ప్రమోట్ చేసి.. ఎఫ్-1ను ఇండియాకు తీసుకొచ్చారు. 2011, 2012, 2013లో నోయిడాలో జేపీ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్మించిన ట్రాక్ పై ఎఫ్-1 రేస్ జరిగింది. 1984లో ఏషియన్ గేమ్స్, ఆ తర్వాత కామన్వెల్త్ గేమ్స్ మన దేశ రాజధాని ఢిల్లీలో జరిగాయి. కామన్ వెల్త్ గేమ్స్ కండక్ట్ చేయడానికి 70,608 కోట్లు ఖర్చు చేయడం జరిగింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒరిజినల్ ఎస్టిమేట్ కంటే.. 114 రెట్లు ఎక్కువ. ఈ కామన్వెల్త్ కుంభకోణంలో సురేశ్ కల్మాడి జైలుకు వెళ్లాడని కేటీఆర్ గుర్తు చేశారు.
2013 అక్టోబర్ 24 నుంచి నవంబర్ 1 వరకు ఉమ్మడి ఏపీలో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఆప్రో ఏషియన్ గేమ్స్ నిర్వహించారు. దీని ఖర్చు 103 కోట్లు. ఒక క్రీడల కోసం ప్రభుత్వాలు ఖర్చు పెట్టడం పరిపాటి. కామన్ వెల్త్ గేమ్స్ యూపీఏ ప్రభుత్వం నిర్వహించింది. నోయిడాలో 2010-11లో ఎఫ్-1 ఖర్చు 1700 కోట్లు. తమిళనాడులో ఫార్ములా -4 రేస్ జరిగింది నాలుగు నెలల క్రితం. ఆ రాష్ట్ర ప్రభుత్వం 42 కోట్లు ఖర్చు పెట్టిందని కేటీఆర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Y.Satish Reddy | ఫార్ములా ఈ రేసు ఇష్యూలో అసలు దోషి రేవంత్ రెడ్డే : వై.సతీష్ రెడ్డి