KTR | హైదరాబాద్ : గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్వహించిన ఫార్ములా-ఈ రేస్‌తో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఫార్ములా-ఈ రేస్ నిర్వహణతో రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
ఈ ఏడాది మార్చి నెలలో జమ్మూకశ్మీర్‌లో ఎఫ్-4 రేసింగ్ జరిగింది. ఈ రేస్‌పై నరేంద్ర మోదీ 2024 మార్చి 17న మోటార్ రేసింగ్‌లకు భారతదేశం అనువైన దేశం.. కశ్మీర్ మరింత అందమైన రాష్ట్రం అని మోదీ ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీకి కూడా మోటార్ రేసింగ్ అలవాటు ఉంది. అయితే ఎఫ్-1 ఎప్పుడైతే చంద్రబాబు తేవాలనుకున్నారో.. దాని కోసం నేను మంత్రి అయ్యాక చాలా ప్రయత్నం చేశాను. చంద్రబాబు కలిశారని ఎఫ్-1 నిర్వాహకులకు గుర్తు చేశాను. నోయిడాలో క్యాన్షిల్ అయింది.. మా దగ్గరకు రండి.. ఎఫ్-1కు కావాల్సిన భూసేకరణ నోటీసులు ఉన్నాయి. మీకు డేడికెటెడ్ ట్రాక్ కట్టిస్తామనని చెప్పాను. మాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పారు. అయితే మోటార్ రేసింగ్‌లో వస్తున్న మార్పులపై మానిటర్ చేస్తున్న క్రమంలో.. మేం గమనించిన ట్రెండ్ ఏందంటే.. ఎలక్ట్రిక్ వాహనాలు. మన భవిష్యత్ తరాలకు కాలుష్యం తేవొద్దని ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను ప్రోత్సహిస్తున్నారు. ఈ వినియోగం పెరిగిన తర్వాత.. అప్పట్నుంచి ఫార్ములా రేసింగ్‌లో ఎలక్ట్రిక్ వెహికల్స్ పరిచయం అయ్యాయి. ఫార్ములా -ఈ శబ్ద, ధ్వని, వాయు కాలుష్యం లేకుండా ఉంటుందని భావించి, దీన్ని మేం పట్టుకున్నాం. ఎఫ్-1 రాదన్నప్పుడు ఇక ఎఫ్ఐఏతో సంప్రదింపులు జరిపాం. స్టడీ చేశాం. ఫార్ములా -ఈ లండన్ న్యూయార్క్, పారిస్, రోమ్, టోక్కో, మొనాకో వంటి నగరాల్లో జరుగుతున్నాయి. ఈ నగరాల సరసన మన నగరాన్ని విశ్వనగరంగా చూడాలన్న ఉద్దేశంతో పోటీ పడ్డాం. వాళ్లు ఆసక్తి చూపలేదు. అయినప్పటికీ అన్ని విషయాలను చర్చించాం. తప్పకుండారావాలని పట్టుబడితే.. సియోల్‌ను, జోహెన్నెస్ బర్గ్‌ను తట్టుకుని మన హైదరాబాద్‌కు ఫార్ములా-ఈని తీసుకొచ్చామని కేటీఆర్ గుర్తు చేశారు.
49 కోట్ల మంది చూస్తారు ఈ రేసింగ్‌ను. మేం ఆలోచన చేసిందంటే.. ఈవీ ట్రెండ్‌గా మారింది. భవిష్యత్ అంతా ఈవీలదే అని చెప్పి ఈవీని ప్రోత్సహించాలని మొబిలిటీ వీక్ నిర్వహించాం. ఎలక్ట్రానిక్ వాహనాలకు మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్నోవేషన్, రేసింగ్‌కు వేదిక కావాలన్నదే ప్రధాన ఎంజెడా. ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చేందుకు ఇక్కడికి ఫార్ములా- ఈ రేసింగ్ తీసుకొచ్చాం. 2023, ఫిబ్రవరిలో ఈ రేస్ నిర్వహించాం. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఖర్చు 40 కోట్ల కంటే ఎక్కువ పెట్టలేదు. ప్రమోటర్ గ్రీన్ కో కంపెనీ 100 కోట్లు పెట్టారు. మొత్తం ఖర్చు 140 కోట్లు. దీంతో హైదరాబాద్‌కు 700 కోట్లు లాభం వచ్చిందని నెల్సన్ అనే సంస్థ రిపోర్టు ఇచ్చింది. అది కాకుండా ఎన్నో పరిశ్రమలను అట్రాక్ట్ చేశాం. మహబూబ్‌నగర్ దివిటిపల్లిలో అమర్ రాజా బ్యాటరీస్ 9500 కోట్ల పెట్టుబడి పెట్టింది. హ్యుండయ్ 1400 కోట్లు పెట్టుబడి పెట్టింది. బ్యాటరీ వెహికల్స్ కోసం కొత్త పాలసీ తెచ్చాం. 1200 కోట్ల పెట్టుబడి బిలిటీ పెట్టింది. ఈవీ సమ్మిట్లోనే 2,500 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను ప్రపంచ వ్యాప్తంగా పెంచామని కేటీఆర్ గుర్తు చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | కామన్వెల్త్ గేమ్స్ అనగానే కాంగ్రెస్ కుంభకోణం గుర్తుకొస్తది : కేటీఆర్
Y.Satish Reddy | ఫార్ములా ఈ రేసు ఇష్యూలో అసలు దోషి రేవంత్ రెడ్డే : వై.సతీష్ రెడ్డి