Sarfaraz Ahmed : పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ (Sarfaraz Ahmed) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. దాదాపు మూడేళ్లుగా జాతీయ జట్టుకు దూరమైన సర్ఫరాజ్ రిటైర్మెంట్కు సమయం వచ్చిందని భావించాడు. ఇక ఆలస్యం చేయకూడదని ఆదివారం అతడు అల్విదా చెప్పేశాడు. దాంతో.. ఈ మాజీ సారథి 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడింది. పాక్ జూనియర్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన సర్ఫరాజ్ సీనియర్ జట్టు కోచ్‌గా ఎంపికయ్యే అవకాశముంది.
పాకిస్థాన్ క్రికెట్లో విజయవంతమైన సారథిగా చరిత్రకెక్కిన సర్ఫరాజ్ అహ్మద్ కెరీర్ ముగిసింది. అంతర్జాతీయంగా 100 మ్యాచుల్లో సారథిగా వ్యవహరించిన సర్ఫారాజ్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ‘పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించడం నా జీవితంలో దక్కిన గొప్ప గౌరవం. అండర్ -19 జట్టును 2006లో ఛాంపియన్‌గా నిలపడం, 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ విజయం.. పాక్ జెర్సీలో ప్రతి క్షణం ప్రత్యేకమైనదే.
Sarfaraz Ahmed said that representing Pakistan had always been the greatest honour of his life.#Cricket | #Pakistan | #SarfarazAhmed | #Lahore pic.twitter.com/OeTe0LLNI1
— Khel Shel (@khelshel) March 15, 2026
అన్ని ఫార్మాట్లలో పాకిస్థాన్ జట్టుకు కెప్టెన్సీ చేయడం ద్వారా నా కల నిజమైంది. నేను ఎల్లప్పుడూ భయం లేకుండా ఆడేందుకు ప్రయత్నించాను. అలానే.. జట్టులో ఐక్యత పెంచాను. బాబర్ ఆజాం, షాహీన్ అఫ్రిది, హసన్ అలీ.. తదితరులను మ్యాచ్ విన్నర్లుగా మలచడం నా కెప్టెన్సీలో సాధించిన గొప్ప విజయం నాపై నమ్మకం ఉంచినందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పాకిస్థాన్ క్రికెట్ నా గుండెకు చాలా చేరువగా ఉంటుంది. ఇకపై కూడా సాధ్యమైన విధంగా పాక్ క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తాను’ అని సర్ఫరాజ్ తన వీడ్కోలు సందేశంలో పేర్కొన్నాడు.
కరాచీలో జన్మించిన సర్ఫరాజ్ అండర్-19 వరల్డ్‌కప్ హీరోగా సీనియర్ జట్టులోకి వచ్చాడు. వికెట్ కీపర్, బ్యాటర్‌గా 2007లో భారత జట్టుపై వన్డేల్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ కెరీర్ దాదాపు ఇరవయ్యేళ్లు సాగింది. మొత్తంగా 54 టెస్టులు, 117 వన్డేలు, 61 టీ20లు ఆడాడు. వికెట్ కీపర్‌గా రాణించి 315 క్యాచ్‌లు పట్టిన అతడు.. 56 మందిని స్టంపౌట్ చేశాడు.
Sarfaraz Ahmed the 2017 Champions Trophy winning captain of Pakistan announced his retirement from all forms of Cricket.
Thank you Sarfaraz Ahmed ❤️#SarfarazAhmedpic.twitter.com/Gb0b36jfLw
— Cricket With Abdullah (@cric___guy) March 15, 2026
కెప్టెన్‌గా సర్ఫరాజ్ జట్టును అద్భుతంగా నడిపాడు. అతడి సారథ్యంలోనే పాక్ 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియాను ఓడించి విజేతగా అవతరించింది. పొట్టి ప్రపంచకప్‌లో సూపర్ 8 దశలోనే పాకిస్థాన్ నిష్క్రమించడంతో.. జట్టును గాడీలో పెట్టేందుకు సర్ఫరాజ్ రంగంలోకి దిగుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి.