KTR | హైదరాబాద్ : ఫార్ములా -ఈ రేస్ వల్ల జరిగే లాభం సీఎం రేవంత్ రెడ్డికి తెలియదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. చివరి నిమిషంలో ఫార్ములా-ఈ రేస్‌ను క్యాన్షిల్ చేయడంతో రాష్ట్రానికి రూ. 800 కోట్ల నష్టం వచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
2023 ఫిబ్రవరిలో ఫార్ములా-2 రేస్ నిర్వహించాం. నాలుగేండ్ల పాటు ఒప్పందం కుదిరింది. హోస్ట్ సిటీగా హైదరాబాద్(హెచ్ఎండీఏ), ప్రయివేటు స్పాన్సర్‌గా గ్రీన్ కోకు సంబంధించిన ఏస్ అర్బన్ అనే కంపెనీ, ఎఫ్ఐఏ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ప్రమోటర్ ఎమన్నారంటే ప్రభుత్వానికి లాభం వచ్చింది కానీ నాకు ప్రచారం రాలేదన్నాడు. వచ్చే ఏడాది స్పాన్సర్ చేయను అని చెప్పి వెనక్కి వెళ్లాడు. ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్టు సమాచారం ఇచ్చారు. దీంతో ఎఫ్ఐఏ వాళ్లు ఏం చేశారంటే మాకు సమాచారం ఇచ్చారు హైదరాబాద్‌లో నిర్వహించట్లేదని. గ్రీన్ కో కంపెనీ పైసలు రాలేదని తప్పుకుంది. ఈ విషయంపై నన్ను జూన్, జులైలో సెక్రటరీ అరవింద్ కుమార్ అడిగారు. గ్రీన్ కో కాకపోతే మరొక స్పాన్సర్‌ను పట్టుకుందామని చెప్పితే వారికి కమిట్మెంట్ ఇచ్చారు. చివరకు వాళ్లు ప్రకటించిన క్యాలెండర్లో మన హైదరాబాద్ పేరు లేదు. ఆ తర్వాత వాళ్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడాను. తప్పకుండా మా ప్రభుత్వం వస్తది.. ఆరు నెలల తర్వాత. నేను ప్రయివేటు ప్రమోటర్లను పట్టుకుని.. ఏర్పాట్లు చేస్తాం. తాత్కాలికంగా పైసలు ఇస్తామని మాటిచ్చాను. గవర్నెమెంట్ నుంచి కడుదాం.. మళ్లీ తీసేసుకుందాం అని అరవింద్ కుమార్‌కు చెప్పానని కేటీఆర్ గుర్తు చేశారు.
హెచ్ఎండీఏ 2024 నవంబర్ 14న జీవో ఇచ్చింది. రేస్‌కు సంబంధించి హెచ్ఎండీఏకు సంపూర్ణ అవగాహన ఉంది. కామన్వెల్త్కు 70 వేల కోట్లు పెట్టారో.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు, ఈవీల్లో టాప్ చాంపియన్ చేసేందుకు ఈ రేస్ నిర్వహణకు హెచ్ఎండీఏ నుంచి రూ. 55 కోట్లు కట్టాం. ఇందులో అరవింద్ కుమార్ తప్పు లేదు. మంత్రిగా నేనే సంతకం పెట్టి నిర్ణయం తీసుకున్నా. కేబినెట్ నిర్ణయం లేదు కదా అని అంటున్నారు. హెచ్ఎండీఏ, హెచ్ఎండబ్ల్యూఎస్, జీహెచ్ఎంసీ మూడు విభాగాలు ఇంటర్నల్‌గా డబ్బులను అడ్జస్ట్ చేసుకుంటాయి. ఇది రెగ్యులర్‌గా జరిగే పని. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అదే పని చేస్తది. హెచ్ఎండీఏ ఇండిపెండెంట్ బోర్డు. చైర్మన్ సీఎం, వైస్ చైర్మన్ మున్సిపాలిటీ మంత్రి. నా ఆదేశాల మేరకు సెక్రటరీ డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు.
రేస్ వల్ల జరిగే లాభం రేవంత్ రెడ్డికి తెలియదు. చెప్తే వినరు. కూలగొట్టుడు తప్ప నిర్మాణం తెల్వదు. పాజిటివ్ మనషులు కాదు. పిచ్చోళ్ల లాగా నా మీద కోపంతో రేస్‌ను క్యాన్షిల్ చేశారు. మా కేసీఆర్ గవర్నమెంట్లో ఫార్ములా ఈ రేస్ తీసుకొస్తే.. రేవంత్ రెడ్డేమో ఇంటర్నేషనల్ షేమ్ తెచ్చిండు. ప్రపంచంలో మన పరువు తీసిండు. రేవంత్ రెడ్డి చేసిన తప్పు వల్ల 800 కోట్ల నష్టం వచ్చిందని కేటీఆర్ ధ్వజమెత్తారు.
ఇవి కూడా చదవండి..
KTR | ఫార్ములా-ఈ రేస్‌తో హైదరాబాద్ బ్యాండ్ ఇమేజ్ పెరిగింది : కేటీఆర్
KTR | కామన్వెల్త్ గేమ్స్ అనగానే కాంగ్రెస్ కుంభకోణం గుర్తుకొస్తది : కేటీఆర్