KTR | జైలుకు వెళ్లేందుకు అభ్యంతరం ఏం లేదు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
KTR | నా మీద ఎందుకు కేసులు పెడుతావ్.. హైదరాబాద్ ఇమేజ్ పెంచినందుకా..? అని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. జైలుకు వెళ్లేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
KTR | హైదరాబాద్ : నా మీద ఎందుకు కేసులు పెడుతావ్.. హైదరాబాద్ ఇమేజ్ పెంచినందుకా..? అని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. జైలుకు వెళ్లేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
ఫార్ములా-ఈ రేస్ విషయంలో మీడియాకు చెప్పిందే.. అక్కడ చెబుతా. గవర్నమెంట్‌గా నిర్ణయం తీసుకున్నానని చెబుతాను. హైదరాబాద్, తెలంగాణ అభివృద్ధి దృష్ట్యా నిర్ణయం తీసుకున్నాను. నా మీద కేసులు ఎందుకు పెడుతావ్.. హైదరాబాద్ ఇమేజ్ పెంచినందుకా..? లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకా..? ప్రపంచపటంలో హైదరాబాద్‌ను నిలబెట్టినందుకా..? బెంగళూరును దాటి హైదరాబాద్‌లో ఐటీ ఎగుమతులు పెంచినందుకా..? పారిపోతాయన్న కంపెనీలను కాపాడినందుకా..? దిగ్గజ కంపెనీలకు డ్రీమ్ డెస్టినేషన్‌గా మార్చినందుకా..? కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర పిల్లల భవిష్యత్‌కు బంగారు బాటలు వేసినందుకా..? అటెన్షన్ డైవర్షన్ గేమ్‌లతో రేవంత్ రెడ్డి ఎక్కువ రోజులు తప్పించుకోలేడు. నువ్వు ఎన్ని వేషాలు వేసినా.. మేం నిన్ను విడిచిపెట్టం. ఆరు గ్యారెంటీలను వదిలిపెట్టం. అప్పుడప్పుడు నువ్వు గోకినట్టు చేస్తే మేం కూడా వివరణ ఇస్తాం ఎందుకంటే ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ఇన్ని చెప్పినా కూడా కేసు పెడుతాం అంటే నీ ఇష్టమున్న కేసు పెట్టుకో అని రేవంత్ రెడ్డికి కేటీఆర్ తేల్చిచెప్పారు.
కేటీఆర్ టార్గెట్ అని పేపర్లలో రాస్తున్నారు. ఆరు గ్యారెంటీల అమలు, వడ్ల కొనుగోలు, రైతుబంధు, దళితబంధు, స్కూటీలు ఇచ్చుడు, తులం బంగారం ఇచ్చుడు, గురుకులాలు బాగు చేసే విషయంలో టార్గెట్ ఉండాలి.. టార్గెట్ కేటీఆర్ కాదు. వేస్తే వేసుకో.. నాకేం ఫరక్ పడేది లేదు. ఓ రెండు, మూడు నెలలు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు. మంచిగా పోతా.. యోగా గిగా చేసుకోని ట్రిమ్గా వస్తా.. పాదయాత్ర ఎక్కుతా. నేను భయపడేటోని కాదు. ఈ ఉడుత ఊపులకు భయపడను. గాసిస్ప్ పక్కకు పెట్టి.. గవర్నమెంట్ మీద దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సూచించారు.
ఇవి కూడా చదవండి..
KTR | మెగా కృష్ణారెడ్డి ఇంటి మీదకు ఏసీబీని పంపే దమ్ముందా..? రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
KTR | ఫార్ములా -ఈ రేస్ వల్ల జరిగే లాభం రేవంత్ రెడ్డికి తెలియదు.. మండిపడ్డ కేటీఆర్
KTR | ఫార్ములా-ఈ రేస్‌తో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది : కేటీఆర్
KTR | కామన్వెల్త్ గేమ్స్ అనగానే కాంగ్రెస్ కుంభకోణం గుర్తుకొస్తది : కేటీఆర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- ACB Case
- Congress govt
- farmers
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

