Revanth Reddy | న్యూఢిల్లీ : తెలంగాణను ఉద్ధరించాడట.. ఇక ఇప్పుడు ఢిల్లీని ఉద్ధరిస్తడంట.. దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల వేళ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గప్పాలు కొట్టారు. తెలంగాణ ప్రజలను మోసం చేసింది చాలక.. ఇప్పుడు ఢిల్లీ ప్రజలను మోసం చేసేందుకు రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారు. ఆరు గ్యారెంటీల్లో ఏ ఒక్క గ్యారెంటీని కూడా సంపూర్ణంగా అమలు చేయని రేవంత్ రెడ్డి.. ఢిల్లీ వేదికగా మాట్లాడుతూ.. అన్ని గ్యారెంటీలను అమలు చేశామంటూ మోసపూరిత మాటలు మాట్లాడారు.
ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ. 500లకే గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంతే కాదు.. ఢిల్లీ ప్రభుత్వాన్ని నడపడానికి తెలంగాణ నుండి మద్దతు ఇస్తామని చెప్పారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తే తెలంగాణ నుండి ఏ సహాయం కావాలన్నా చేస్తామని రేవంత్ పేర్కొన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తే హామీలు అమలు చేయించే బాధ్యత నాది అని సీఎం రేవంత్ రెడ్డి ఉచిత హామీ ఇచ్చారు.
షీలా దీక్షిత్ సీఎంగా ఉన్నప్పుడు మాత్రమే ఢిల్లీలో అభివృద్ధి జరిగింది తప్ప ఆ తర్వాత పరిస్థితి ఎలాంటి దుస్థితికి చేరుకుందో చూడండి అని రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇటు సీఎంగా కేజ్రీవాల్, అటు పీఎంగా మోడీ ఢిల్లీకి చేసింది ఏమీ లేదు. ఇద్దరూ కలిసి ఢిల్లీని నాశనం చేశారు. ఇద్దరూ వేరు కాదు.. ఒక్కటే. ఢిల్లీని బాగుచేయాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిందే అని రేవంత్ రెడ్డి అన్నారు.
ఇవి కూడా చదవండి..
Congress | నామినేటెడ్ పదవి ఇవ్వకుంటే.. గాంధీ భవన్ మెట్ల మీద ధర్నా చేస్తా : సునీతారావు
BRS Party | ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు
Guvvala Balaraju | మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై కేసు నమోదు