Guvvala Balaraju | మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై కేసు నమోదు
Guvvala Balaraju | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై(Guvvala Balaraju) కేసు నమోదైంది. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని భ్రమరాంబ ఆలయం వద్ద నిన్న(గురువారం) రాత్రి పోలీసు విధులకు ఆటంకం కలిగించాడని మాజీ ఎమ్మెల్యే బాలరాజుపై ఎస్ఐ రమేశ్ ఫిర్యాదు చేశారు.
నాగర్‌కర్నూల్ : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై(Guvvala Balaraju) కేసు నమోదైంది. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని భ్రమరాంబ ఆలయం వద్ద నిన్న(గురువారం) రాత్రి పోలీసు విధులకు ఆటంకం కలిగించాడని మాజీ ఎమ్మెల్యే బాలరాజుపై ఎస్ఐ రమేశ్ ఫిర్యాదు చేశారు. ఈమేరకు గువ్వల బాలరాజు, పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే చిక్కుడు వంశీ కృష్ణ ఆలయంలో ఉన్నాడని, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును ఆలయంలోకి అనుమతించలేదు.
దీంతో గువ్వల బాలరాజు, బీఆర్ఎస్ నేతలు అధికారులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు, గువ్వల బాలరాజు అనుచరుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఆలయం ఎదుటే బైఠాయించి వారు నిరసన తెలిపారు. అయితే నన్ను కావాలనే పోలీసులు ఆలయంలోకి వెళ్లకుండా ఆపారని గువ్వల మండిపడ్డారు. ఇన్స్పెక్టర్ రవీందర్ అనే వ్యక్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీ కృష్ణతో కుమ్మక్కై నన్ను టార్గెట్ చేసి ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని బాలరాజు ఆరోపించారు. న్యాయ వ్యవస్థ సుమోటోగా కేసు స్వీకరించించి తనకు న్యాయం చేయాలని కోరిన విషయం తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

