హైదరాబాద్ : కామారెడ్డి(Kamareddy) జిల్లా కేంద్రంలో పలువురు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు(BRS leaders), మున్సిపల్ కౌన్సిలర్లను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్(Suspension) చేసింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి వత్తాసు పలుకుతూ పనిచేసిన కారణంగా నిట్టు వేణుగోపాల్, నిట్టు వెంకట్రావు, కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు నిట్టు కృష్ణమోహన్, ముప్పారపు ఆనంద్లను పార్టీ నుంచి బహిష్కరించినట్లు కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి ప్రస్తుతం కుట్రపూరితంగా మోసపూరిత చర్యలకు పాల్పడుతున్న వ్యక్తులను ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారని అందులో పేర్కొన్నారు.
Also Read..