Supreme Court | హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సుప్రీంకోర్టు (Supreme Court) ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆరు నెలల తర్వాత ఆయన జైలు నుంచి బయటకు రాబోతున్నారు.
మద్యం పాలసీకి సంబంధించి సీబీఐ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కేజ్రీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దాంతోపాటు బెయిల్ కోసం అభ్యర్థిస్తూ మరో పిటిషన్ కూడా వేశారు. ఈ రెండు పిటిషన్లపై ఈ నెల 5న విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది.
ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. సీబీఐ అరెస్టు చెల్లుబాటు అవుతుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సుదీర్ఘంగా నిర్బంధించడం అంటే.. వ్యక్తి హక్కులను హరించినట్లే అవుతుందని వ్యాఖ్యానించింది. విచారణ ప్రక్రియ శిక్షగా మారకూడదని.. ఈడీ కేసులో బెయిల్ లభించిన వెంటనే సీబీఐ అరెస్ట్ చేయడం సరైంది కాదని కోర్టు అభిప్రాయపడింది.
Also Read..
Arvind Kejriwal | సత్యమే గెలిచింది.. కేజ్రీవాల్‌కు బెయిల్ రావడంపై ఆప్ నేతలు హర్షం
Arvind Kejriwal | ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ‘సుప్రీం’ బెయిల్.. సీబీఐ కేసులో ఊరట
Kaushik Reddy | కాంగ్రెస్ వాళ్లకు ఓ చట్టం.. తమకో చట్టమా: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి