న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్ష అభ్యర్థులు కమలా హ్యారిస్(Kamala Harris), డోనాల్డ్ ట్రంప్.. కొన్ని రోజుల క్రితం చర్చలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ చర్చ సమయంలో కమలా హ్యారిస్ ధరించిన చెవి రింగుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె తన చెవులకు ఆడియో హెడ్‌ఫోన్స్ పెట్టుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆమె చెవి రింగు అచ్చం ఆడియో ఇయర్రింగ్ తరహాలో ఉన్నట్లు నెటిజన్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఐస్‌బాచ్ సౌండ్ సొల్యూషన్స్ ఓ ప్రకటన చేసింది.
చర్చ సమయంలో కమలా హ్యారిస్ ధరించిన చెవి పోగులు అచ్చం తమ కంపెనీకి చెందిన బ్లూత్టూత్ డివైస్ తరహాలో ఉన్నట్లు ఐస్‌బాచ్ మేనేజింగ్ డైరెక్టర్ మాల్టే ఇవర్సన్ తెలిపారు. ఐస్బాచ్కు చెందిన నోవా హెచ్1 ఆడియో ఇయర్రింగ్స్ తరహాలోనే కమలా హ్యారిస్ ధరించిన చెవిపోగు ఉన్నట్లు కంపెనీ ఎండీ వెల్లడించారు. ఇంకా ఆయన ఓ చమత్కారం కూడా చేశాడు.
కమలా హ్యారిస్ తమ ఇయర్ రింగ్‌ను ధరించిందో లేదో తెలియదు కానీ ఆ చెవి పోగు మాత్రం మా డివైస్ తరహాలో ఉన్నదని, ఒకవేళ మేల్ వర్షన్ కావాలంటే, ట్రంప్‌కు కూడా అలాంటి రింగును తయారుచేసి ఇవ్వనున్నట్లు మాల్టే ఇవర్సన్ తెలిపారు. నిజానికి కమలా హ్యారిస్ ధరించింది డబుల్ పెరల్ ఇయర్రింగ్స్ అని, అవి టిఫనీ అండ్ కంపెనీకి చెందినట్లు ఎక్కువ శాతం మంది నిపుణులు అభిప్రాయపడ్డారు.
🚨🚨KAMALA HARRIS EXPOSED FOR WEARING EARPIECE IN DEBATE *PROOF
She is seen wearing an earring developed by Nova Audio Earrings first seen at CES 2023.
This earring has audio transmission capabilities and acts as a discreet earpiece.
Kamala Harris confirms claims that a… pic.twitter.com/1y60rUdJT0
— ELECTION2024 🇺🇸 (@24ELECTIONS) September 11, 2024