Bagheera Movie | కన్నడ రోరింగ్ స్టార్ శ్రీమురళి హీరోగా వస్తున్న తాజా చిత్రం బఘీరా(Bagheera). ఈ సినిమాకు ‘కేజీఎఫ్’, ‘సలార్’ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ కథను అందిస్తుండగా.. డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ‘కేజీఎఫ్’, కాంతారా చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌ను విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ నుంచి విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను 2024 అక్టోబర్ 31 వరల్డ్ వైడ్‌గా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మూవీ నుంచి పోస్టర్‌ను పంచుకున్నారు.
The hunt for justice begins!#Bagheera roars into cinemas on October 31st 💥💥@SRIMURALIII #DrSuri #PrashanthNeel @VKiragandur @rukminitweets @AJANEESHB @hombalefilms @ChaluveG @GarudaRam @AJShetty @ChethanDsouza @yogigraj @prakashraaj @BagheeraTheFilm#BagheeraOnOct31 pic.twitter.com/1up39HH18S
— #SRIIMURALI (@SRIMURALIII) September 11, 2024