KTR | హైదరాబాద్ : సోమవారం ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభం కాగా, మంగళవారం తెల్లవారుజామున 3 గంటల వరకు సభ కొనసాగిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు కీలక సూచన చేశారు. మంగళవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ అనుమతితో కేటీఆర్ ఈ సూచన చేశారు.
ఒకే రోజు 19 పద్దులపై చర్చ జరిపి అప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో మంగళవారం తెల్లవారుజామున 3 గంటల వరకు సభను నడిపారు. సుదీర్ఘ ప్రసంగాలు చేయొద్దన్న శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రతిపాదనను అంగీకరిస్తున్నాము. కానీ ఈ సభలో 57 మంది కొత్త సభ్యులు ఉన్నారు.. వారందరూ మాట్లాడాలని అనుకుంటున్నారు. ఇలా రోజుకు 19 పద్దులపై చర్చ పెట్టకుండా.. రోజుకు 2 లేదా 3 పద్దులపైన చర్చ పెట్టాలని కోరుతున్నాం. రేపు ద్రవ్య వినిమయ బిల్లు పెడుతున్నారు. ఈ సమావేశాలు అయిపోయాయి. కానీ వచ్చే అసెంబ్లీ, బడ్జెట్ సమావేశాల్లో రోజుకు 19 పద్దులు పెట్టకుండా, 2 లేదా 3 పద్దులపై సావధానంగా చర్చ జరిగేలా చర్యలు తీసుకోవాలి. మంత్రులు కూడా సుదీర్ఘ వివరణ ఇచ్చే అవకాశం ఉంటుంది. వచ్చే సెషన్‌ను అవసరమైతే 20 రోజులు పెట్టాలి. మా వైపు నుంచి తప్పకుండా కో ఆపరేషన్ చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
CM Revanth Reddy | 24 గంటల విద్యుత్తుకు ఆద్యుడు చంద్రబాబు..అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ అబద్దాలు
Manjeera | మంజీరలో ఇసుక మాఫియా! చక్రం తిప్పుతున్న కాంగ్రెస్ కీలక నేత