భూపాలపల్లి రూరల్, సెప్టెంబర్ 23 : సింగరేణి కార్మికులకు(Singareni workers) 33 శాతం లాభాల బోనస్ చెల్లించాలని టీబీజీకేఎస్(TBGKS) భూపాలపల్లి బ్రాంచి వైస్ ప్రెసిడెంట్ బడితల సమ్మయ్య డిమాండ్ చేశారు. సోమవారం భూపాలపల్లి(Bhupalapalli) సింగరేణి ఏరియాలోని కేటీకే-1, కేటీకే-5, కేటీకే-6 ఇైంక్లెన్లు, ఓసీ గనులపై సింగరేణి కార్మికులకు వాస్తవ లాభాల్లో 33 శాతం బోనస్‌గా అందించాలని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాడ్జీలతో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా టీబీజీకేఎస్ భూపాలపల్లి సమ్మయ్య మాట్లాడుతూ లాభాల వాటా చెప్పకుండా సగం మాత్రమే ఇస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం పునఃపరిశీలించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఫిట్ సెక్రటరీలు కాగితపు సురేశ్, నరేశ్ నేత, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ రవితేజ, వెంకట్రాజం, సత్తిరెడ్డి, ప్రవీణ్, మీనుగు రవి, చీకటి వంశీ, కిరణ్, రాజు, హరికృష్ణ, సురేశ్, రవి, బాలాజీ, కార్మికులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | అమృత్ టెండర్లలో రేవంత్ భారీ అవినీతి.. బీజేపీ మౌనంపై కేటీఆర్ ఆశ్చర్యం..
Bathukamma | పువ్వులనే దైవాలుగా పూజించే పండుగ.. మన బతుకమ్మ పండుగ.. ఇవీ విశేషాలు..!
Harish Rao | రాష్ట్రంలో ప్రజా పాలన కాదు.. గూండా రాజ్యం నడుస్తుంది : హరీశ్‌రావు