KTR | హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అమృత్ టెండర్లలో అవినీతికి పాల్పడిందని, వాటి నిజాలను నిగ్గు తేల్చాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, టోచన్ సాహూకు గత శుక్రవారం లేఖ రాశారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన రూ. 8,888 కోట్ల అమృత్ టెండర్ల కుంభకోణం గురించి సాక్ష్యాలతో సహా బయటపెట్టారు కేటీఆర్. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే.. ఫిబ్రవరి మొదటి వారంలో రూ. 8,888 కోట్ల భారీ అవినీతికి సీఎం రేవంత్ రెడ్డి తెరలేపారని కేటీఆర్ విమర్శించారు.
అమృత్ టెండర్ల కుంభకోణంలో సీఎం రేవంత్ రెడ్డి మోసాన్ని బయటపెట్టినందుకు కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతల నుంచి అభినందనలు వస్తున్నాయి. కానీ తెలంగాణ బీజేపీ నేతల మౌనం ఆశ్చర్యపరుస్తున్నది. తమకు ఏమి తెలియనట్లు, వినబడనట్లు బీజేపీ నేతల వ్యవహారం ఉందన్నారు. రేవంత్ రెడ్డి, బీజేపీ నేతల మధ్య అద్భుతమైన ప్రేమకథనే నడుస్తుందని కేటీఆర్ ఎద్దెవా చేస్తూ ట్వీట్ చేశారు.
Been getting congratulatory messages from some senior Congress Leaders on exposing Revanth Reddy’s Scam in Amrut tenders
But stunning & deafening is the silence of Telangana BJP leaders
Ajab Prem Ki Ghazab Kahani Hain Yeh RR Aur BJP Ki 🙏
— KTR (@KTRBRS) September 23, 2024
KTR | రేవంత్ రెడ్డి చేసిన 8,888 కోట్ల భారీ కుంభకోణాన్ని బయటపెట్టిన కేటీఆర్
Kaleshwaram | కాళేశ్వరం స్వరూపంపై మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అవగాహన లేదు : వినోద్ కుమార్
TG Rain Alert | తెలంగాణలో మరో మూడురోజులు భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ