Kaleshwaram | కరీంనగర్ : ఉత్తర తెలంగాణ వర ప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపై మాజీ బీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ మండిపడ్డారు. ఏదైనా మాట్లాడే ముందు.. అవగాహనతో మాట్లాడాలని వినోద్ కుమార్ కాంగ్రెస్ నేతలకు సూచించారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ మంత్రులు, నాయకులు అవగాహనరాహిత్యంతో మాట్లాడుతున్నారని వినోద్ కుమార్ మండిపడ్డారు.
కాళేశ్వరం అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలే అన్న అవగాహనతోనే కాంగ్రెస్ నాయకులు ఉన్నారని పొన్నం ప్రభాకర్ మాటల్లో తెలుస్తున్నదని వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఇంతకంటే అవగాహనారాహిత్యం మరొకటి ఉండదు. కాళేశ్వరంలో నిర్మించిన వందలాది కాంపోనెంట్స్‌లో ఈ మూడు బ్యారేజీలు కూడా ఉన్నాయి తప్ప అవే కాళేశ్వరం ప్రాజెక్టు కాదు. కాళేశ్వరం స్వరూపాన్ని పొన్నం ప్రభాకర్‌కు, అతని సహచరులకు మరొక్కసారి వివరించాల్సిన అవసరం ఉన్నదని వినోద్ కుమార్ తెలిపారు.
బ్యారేజీలు, జలాశయాలు, గ్రావిటి కాలువలు, పైప్ లైన్లు, సొరంగాలు, భూగర్భ పంప్ హౌజ్ లు, సర్జ్ పూల్స్, విద్యుత్ సబ్ స్టేషన్లు, విద్యుత్ లైన్లు.. ఇవన్నీ కలిపితే ఒక ప్రాజెక్టు తయారవుతుందని వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ప్రయోజనాలు 20 జిల్లాల్లో విస్తరించి ఉండడం, కొత్త ఆయకట్టు, స్థిరీకరణ కలుపుకొని మొత్తం 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యమన్నారు. తాగునీటి అవసరాల కోసం 40 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాల కోసం 16 టీఎంసీలు సరఫరా చేసే విధంగా ప్రాజెక్టుల రూపకల్పన జరిగిందన్నారు.
కాంగ్రెస్ హయాంలో ప్రతిపాదించిన ప్రాణహిత – చేవెళ్ళ ప్రాజెక్టులో మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 14 టీఎంసీలు మాత్రమే అని వినోద్ కుమార్ గుర్తు చేశారు. 160 టీఎంసీల నీటిని ఎత్తిపోసి ఎక్కడ నిల్వ చేసుకుంటారని సీడబ్ల్యూసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. మీ ప్రాజెక్టులో నీటి అవసరాలకు, ప్రాజెక్టులో ప్రతిపాదించిన ఆన్లైన్ జలాశయాల నిల్వ సామర్థ్యానికి అసలు పొంతనే లేదని చెపుతూ ఆన్లైన్ జలాశయాల నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవాలని లేదా కృత్రిమ జలాశయాలు నిర్మించమని సలహా ఇచ్చింది. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టులో నిల్వ సామర్థ్యాన్ని 141 టీఎంసీలకు పెంచుకోవడం జరిగిందని వినోద్ కుమార్ తెలిపారు.
కాళేశ్వరంపై కాంగ్రెస్ నాయకుల / మంత్రుల అవగాహనారాహిత్యం.
కాళేశ్వరం అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలే అన్న అవగాహనతోనే కాంగ్రెస్ నాయకులు ఉన్నారని పొన్నం ప్రభాకర్ గారి మాటల్లో తెలుస్తున్నది. ఇంతకంటే అవగాహనారాహిత్యం మరొకటి ఉండదు. కాళేశ్వరంలో నిర్మించిన వందలాది కాంపోనెంట్స్ ఈ… pic.twitter.com/RdyIQThkRT— B Vinod Kumar (@vinodboianpalli) September 23, 2024
ఇవి కూడా చదవండి..
Harish Rao | రాష్ట్రంలో ప్రజా పాలన కాదు.. గూండా రాజ్యం నడుస్తుంది : హరీశ్‌రావు
TG Rain Alert | తెలంగాణలో మరో మూడురోజులు భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ
KTR | దాడులతో సునీతా లక్ష్మారెడ్డి మనో ధైర్యాన్ని దెబ్బతీయలేరు : కేటీఆర్