Singareni | సింగరేణి కార్మికుల కష్టాన్ని బొగ్గుపాలు చేసిన రేవంత్ సర్కార్..!
Singareni | సింగరేణి కార్మికుల కష్టాన్ని రేవంత్ సర్కార్ బొగ్గుపాలు చేసిందని బీఆర్ఎస్ పార్టీ ధ్వజమెత్తింది. రేవంత్ చెప్పేదొకటి, చేసేదొకటి అని మళ్ళీ రుజువైంది.. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులను నమ్మించి నట్టేట ముంచిందని మండిపడింది.
Singareni | హైదరాబాద్ : సింగరేణి కార్మికుల కష్టాన్ని రేవంత్ సర్కార్ బొగ్గుపాలు చేసిందని బీఆర్ఎస్ పార్టీ ధ్వజమెత్తింది. రేవంత్ చెప్పేదొకటి, చేసేదొకటి అని మళ్ళీ రుజువైంది.. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులను నమ్మించి నట్టేట ముంచిందని మండిపడింది. సింగరేణి లాభాలను భారీ మొత్తంలో (33%) కార్మికులకు పంచుతున్నట్లు ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్.. ఈ సంవత్సరం లాభాలు పెరిగినప్పటికీ కార్మికులకు మాత్రం అందించింది కొంతే. గత 15 ఏళ్లలో ఈసారే అత్యంత తక్కువ మొత్తంలో (కేవలం 16.9%) లాభాలు కార్మికులకు అందాయని బీఆర్ఎస్ పార్టీ పేర్కొంది.
సింగరేణి కార్మికులకు ప్రకటించిన లాభాల వాటాపై కార్మిక వర్గాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. కార్మికులకు ఈ సారి ప్రకటించిన వాటా బూటకమని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. రికార్డు బొగ్గు ఉత్పత్తి సాధించడంతో రూ.4,071 కోట్ల నికర లాభాలు వచ్చినట్టు యాజమాన్యం పేర్కొన్నది. ఇందులో నుంచి సింగరేణి భవిష్యత్తు ప్రణాళిక కోసం 2,289 కోట్లను పక్కన బెట్టినట్టు సెలవిచ్చిందని, మిగతా రూ.2,412 కోట్ల లాభాల నుంచే కార్మికులకు 33 శాతం కింద రూ.796 కోట్లను బోనస్‌గా అందజేస్తామని ప్రకటించడంతో కార్మిక వర్గాల్లో నిరసన వ్యక్తమవుతున్నది.
సంస్థ యాజమాన్యం పక్కన పెట్టిన 2,289 కోట్లకు 33 శాతం వాటాలు ఎగ్గొడుతున్నదని నేతలు ఆరోపిస్తున్నారు. గత పదేండ్లలో నికర లాభాల్లో కార్మికుల బోనస్‌ను పరిశీలిస్తే ఈసారే అతి తక్కువ బోనస్ వచ్చిందని వారు తేల్చి చెప్తున్నారు. 2022-23లో 32 శాతం బోనస్ అంటే రూ.2,222 కోట్లకు రూ.711 కోట్లను సంస్థ ఉద్యోగులకు బోనస్‌గా అందజేసింది. ఇప్పుడు 50 శాతం లాభాలను పక్కనబెట్టి, మిగతా 50 శాతానికే బోనస్‌ను ప్రకటించింది. దీంతో కార్మికులకు తీవ్రంగా నష్టం జరిగింది.
సంవత్సరాల వారీగా సింగరేణి కార్మికులకు అందిన బోనస్
2023-24
వచ్చిన లాభాలు – రూ. 4,701 కోట్లు
కార్మికులకు పంచిన వాటా – రూ. 796 కోట్లు
వాటా శాతం – 16.90 %
2022-23
వచ్చిన లాభాలు – రూ. 2,222 కోట్లు
కార్మికులకు పంచిన వాటా – రూ. 700 కోట్లు
వాటా శాతం – 32 %
2021-22
వచ్చిన లాభాలు – రూ. 1227 కోట్లు
కార్మికులకు పంచిన వాటా – రూ. 368 కోట్లు
వాటా శాతం – 30 %
2020-21
వచ్చిన లాభాలు – రూ. 272.64 కోట్లు
కార్మికులకు పంచిన వాటా – రూ. 79.07 కోట్లు
వాటా శాతం – 29 %
2019-20
వచ్చిన లాభాలు – రూ. 993 కోట్లు
కార్మికులకు పంచిన వాటా – రూ. 278 కోట్లు
వాటా శాతం – 28 %
2018-19
వచ్చిన లాభాలు – రూ. 1765 కోట్లు
కార్మికులకు పంచిన వాటా – రూ. 494 కోట్లు
వాటా శాతం – 28 %
2017-18
వచ్చిన లాభాలు – రూ. 1212 కోట్లు
కార్మికులకు పంచిన వాటా – రూ. 327 కోట్లు
వాటా శాతం – 27 %
2016-17
వచ్చిన లాభాలు – రూ. 395 కోట్లు
కార్మికులకు పంచిన వాటా – రూ. 99 కోట్లు
వాటా శాతం – 25 %
2015-16
వచ్చిన లాభాలు – రూ. 1066 కోట్లు
కార్మికులకు పంచిన వాటా – రూ. 245 కోట్లు
వాటా శాతం – 23 %
2014-15
వచ్చిన లాభాలు – రూ. 490 కోట్లు
కార్మికులకు పంచిన వాటా – రూ. 103 కోట్లు
వాటా శాతం – 21 %
సింగరేణి కార్మికుల కష్టాన్ని బొగ్గుపాలు చేసిన రేవంత్ సర్కార్!
రేవంత్ చెప్పేదొకటి, చేసేదొకటి అని మళ్ళీ రుజువైంది.. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులను నమ్మించి నట్టేట ముంచింది.
సింగరేణి లాభాలను భారీ మొత్తంలో (33%) కార్మికులకు పంచుతున్నట్లు ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్.. ఈ… pic.twitter.com/YxOqZlowCZ
— BRS Party (@BRSparty) September 21, 2024
ఇవి కూడా చదవండి..
Liquor Price | త్వరలో మద్యం ధరల పెంపు? చక్రం తిప్పుతున్న పొరుగు రాష్ట్రపు అనుంగుడు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

