RRR Alignment | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) గతంలోనే రూపొందించిన ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్‌మెంట్‌ను మార్చటం వెనుక మతలబు ఏమిటని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీ కోసమే ఈ మార్పు అని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చెప్తున్నా.. మునుపటిదాని కంటే కొత్త అలైన్మెంట్ ఆ సిటీకి మరింత దూరం ఎందుకు పోతున్నదో సమాధానం చెప్పాలని డిమాండ్‌చేశారు.
గత కొన్నిరోజులుగా ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ మార్పుపై గ్రామాల్లో ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో శుక్రవారం తెలంగాణభవన్‌లో ప్రశాంత్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. అలైన్మెంట్ మార్పు వెనుక కుట్రలు ఉన్నాయని పక్కా ఆధారాలతో గుట్టు విప్పారు. దక్షిణ భాగం మొత్తం అలైన్మెంట్ మారకుండా కేవలం కాంగ్రెస్, ప్రభుత్వ పెద్దలకు సంబంధించి వందల ఎకరాల భూములు ఉన్నచోటే ఎందుకు మారింది? అంటూ నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల నుంచే పేద రైతులు దశాబ్దాల నుంచి సాగు చేసుకుంటున్న కుందారం భూములు బిగ్ బ్రదర్స్ ఖాతాలోకి పోతున్న వైనాన్ని ఎండగట్టారు.
ఆ కుందారం భూముల సమీపంలోకే రింగ్ రోడ్డు అలైన్మెంట్ పరుగులు పెట్టడం వెనుక ఆంతర్యమేమిటి? అని ఎండగట్టారు. కేవలం ప్రభుత్వ పెద్దల భూముల ధరలు పెంచుకునేందుకే అలైన్మెంట్ మార్పు కుట్ర జరుగుతున్నదని కుండబద్దలు కొట్టా రు. మార్పు వల్ల కేంద్రం నుంచి తెలంగాణకు రూ.12,500 కోట్ల నిధులు రాకున్నా.. ప్రపంచ బ్యాంకు రుణంతో ఆ ప్రాజెక్టును చేపట్టి తమ భూ ముల ధరలు పెంచుకునే మహా పన్నాగాన్ని రేవంత్ ప్రభుత్వం రచించిందని ఆరోపించారు.
తెలంగాణ ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టడంతో పాటు అ మాయక, పేద రైతుల భూములను చీల్చుతున్న, కొల్లగొడుతున్న ఈ అరాచక వ్యవహారంపై వెంటనే కేంద్రం సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజ య్ వెంటనే సీబీఐ విచారణ వేయించాలని, లేకపోతే బీజేపీ-కాంగ్రెస్ ఒకటేనని తెలంగాణ ప్రజలు నమ్మాల్సి వస్తుందని హెచ్చరించారు. మీడియా సమావేశ వివరాలు వేముల మాటల్లోనే..
ఆర్ఆర్ఆర్ కథ ఇదీ..
అంతకుముందు వాహనాలు జాతీయ రహదారుల మీదుగా ఢిల్లీ, బెంగళూరు, ముంబైకి వెళ్లాలం టే హైదరాబాద్ సిటీ నుంచి వెళ్లాయి. నగర ట్రాఫిక్‌పై తీవ్ర ఒత్తిడి పెరగటంతో అప్పట్లో ఇన్నర్ రింగ్‌రోడ్డు ఏర్పాటు చేశారు. దీంతో ఆ వాహనాలన్నీ ఇన్నర్ రింగు రోడ్డు మీదుగా వెళ్లేవి. కాలక్రమేణా ఆ ఇన్నర్ రింగు రోడ్డు కూడా నగర ట్రాఫిక్‌తో కిక్కిరిసిపోయింది. అనంతరం ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మా ణం చేపట్టారు. ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి 20-25 కిలోమీటర్ల దూరంలో ఔటర్ రింగ్ రోడ్డు కట్టి.. జాతీయ రహదారుల మీదుగా వచ్చే వాహనాలన్నింటినీ ఈ ఔటర్ రింగ్ రోడ్డు మీదికి మళ్లించారు.
ఆ సమయంలో తెలంగాణ ఏర్పడి బీఆర్ఎస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చింది. హైదరాబాద్ ఇంకా విస్తరిస్తుందన్న దూరదృష్టితో ఆలోచించిన అప్పటి సీఎం కేసీఆర్.. నగరానికి 60 కిలోమీటర్ల దూరం లో కొత్త ఎకనామిక్ జోన్ ఏర్పాటు కావాలని ఆకా ంక్షించారు. అందుకు ప్రాంతీయ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) ప్రతిపాదనలు రూపొందించారు. దాన్ని జాతీయ రహదారిగా పరిగణించాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న జాతీయ రహదారులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొ ని.. ఆర్ఆర్ఆర్ను జాతీయ రహదారిగా నిర్మాణం చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించా యి. కేంద్రం ప్రాజెక్టును చేపడితే కేంద్ర అధికారయంత్రాంగమే అలైన్మెంట్ వంటి ప్రక్రియను నిర్వహిస్తుంది. నిర్ధారణ అయ్యాక రాష్ర్టానికి పంపి సమ్మతమేనా? అని మాత్రమే అడుగుతుంది.
లాభనష్టాలు బేరీజు వేసుకున్నరు
తొమ్మిది నెలల కిందట కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి సంబంధించిన ఫైల్ ఆమోదం కోసం కేంద్రం వద్ద ఉన్నదన్న విషయం ఈ ప్రభుత్వానికి తెలుసు. అందుకే గతంలోనే ఫైనల్ అయిన అలైన్మెంట్ వల్ల తమకేం లాభం అనుకొన్నరు. తమ భూములు ఎక్కడెక్కడ ఉన్నయో చూసుకున్నరు. అట్ల బేరీజు వేసుకొని అనేక మంది పేద రైతుల భూముల్లోకి అలైన్మెం ట్ మళ్లించి, వారి భూములను చీల్చి అలైన్‌మెంట్‌ను వాళ్ల భూముల దగ్గరకు మలుపుకున్నరు. కొన్ని నెలలుగా ఈ ప్రభుత్వం అదే పని మీద ఉన్న ది. అలైన్మెంట్ మార్పు మీద ఇటీవల ఒక ప్లాన్ కూడా రిలీజ్ చేసినరు.
ప్రభుత్వ పెద్దల స్వలాభం కోసమే
158 కిలోమీటర్ల ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి రూ.4 వేల కోట్లు భూసేకరణ, రూ.8-9వేల కోట్లు రోడ్డు వేయడానికి ఖర్చవుతుండగా, అందులో భూసేకరణలో సగం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని కేసీఆర్ సర్కారు కేంద్రానికి స్పష్టం చేస్తే కేంద్రం కూడా అంగీకరించింది. 189 కిలోమీటర్ల దక్షిణ భాగం భూసేకరణకు రూ.5 వేల కోట్లు, రోడ్డు వే సేందుకు రూ.10 వేల కోట్లు అవసరమవుతుంది. కేంద్రం గతంలో అంగీకరించిన ప్రకారం దక్షిణభాగానికి సంబంధించి భూసేకరణలో సగం అంటే రూ.2,500 కోట్లు రాష్ట్రం ఇస్తే సరిపోతుంది. మిగిలిన రూ.12,500 కోట్లు కేంద్రమే ఇస్తుంది. కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం వేరే విధంగా ఆలోచిస్తున్నది. గతంలోనే నిర్ణయించిన అలైన్మెంట్ వల్ల తమకు ఏం లాభం లేదనుకొని, వాళ్ల భూ ముల దగ్గరకు రింగ్‌రోడ్డును తీసుకుపోవాలని కొత్త అలైన్మెంట్ ఇచ్చుకున్నారు. అందులోనే భారీ ఎత్తున ప్రభుత్వ పెద్దల స్వలాభం దాగి ఉన్నది.
మరెందుకు మార్చారు?
అక్కడే ఎందుకు జరిగింది?
గత అలైన్మెంట్ హైదరాబాద్ నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని అనుకుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు 50 కాదు.. 60 కిలోమీటర్ల దూరం వరకు ఆర్ఆర్ఆర్ కావాలనుకుంటే దక్షిణ భాగం మొత్తం ఆ మేరకు 10 కిలోమీటర్లు పాత అలైన్మెంట్ ముందుకు జరగాలి. కానీ కేవలం నాలుగైదు చోట్ల ఎంపిక చేసినట్టు మాత్రమే ఎందుకు జరిగింది? దీని వెనక మతలబు ఏంది? కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు, పార్టీ నేతల భూములతో పాటు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్లు పేదల్ని భయపెట్టి, రెవెన్యూ లొసుగులను ఆసరాగా చేసుకొని ఎక్కడెకక్కడ భూముల్ని చవకగా గుంజుకున్నరో ఆయా ప్రాంతాల్లోనే రింగు రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చే ప్రయత్నం చేశారు.
తెలంగాణను ముంచి.. వాళ్ల భూముల ధరలు పెంచి..
కేంద్రం అలైన్మెంట్ ప్రకారం దక్షిణ భాగం నిర్మాణం చేపడితే కేంద్రం నుంచి రూ.12,500 కోట్లు వస్తాయి. కానీ అలైన్‌మెంట్‌ను ఇష్టమొచ్చినట్టు మారిస్తే నిధులు ఇవ్వరు. రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు కొందరు తమ స్వలాభం కోసం అలైన్మెంట్ మార్చారని తెలిస్తే ప్రాజెక్టును కేంద్రం చేపట్టకపోవచ్చు. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవారికి తెలుసు. అయినప్పటికీ ప్రభుత్వం ముందుకుపోతున్నది. ఎందుకంటే.. మాకున్న సమాచారం ప్రకారం కేంద్రం రూ.12,500 కోట్లు ఇవ్వకున్నా.. తెలంగాణ ఆ నిధులు నష్టపోయినా సరే! రింగ్ రోడ్డు మాత్రం మా భూముల గుండానే పోవాలి. అలైన్మెంట్ మార్చాల్సిందే అని అనుకుంటున్నరు. కేంద్రం నిధులు ఇవ్వకున్నా ప్రపంచ బ్యాంకు లోన్ తీసుకుందామనుకుంటున్నరు. తెలంగాణపై రూ.12,500 కోట్ల భారం మోపైనా రింగ్ రోడ్డును తమ భూముల గుండా తీసుకుపోవాలి.. ఆ భూముల ధరలు పెరగాలనేది ఈ ప్రభుత్వ ఆలోచనగా ఉన్నది.
సీబీఐ విచారణ జరపకపోతే మీరంతా ఒక్కటే!
కేంద్రం నిర్ణయించిన అలైన్మెంట్ ప్రకార మే దక్షిణ భాగాన్ని చేపట్టాలి. అప్పుడే కేంద్రం నుంచి తెలంగాణకు రూ.12,500 కోట్ల సా యం అందుతుంది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా ఈ విషయంలో జోక్యం చేసుకొని, పాత అలైన్మెంట్ ప్రకారమే దక్షిణ భాగం పనులు మొదలయ్యేలా చూడాలి. నష్టపోతున్న పేద రైతుల బాధలు అర్థం చేసుకోవాలి. గిరిజనుల బాధ తెలుసుకోవాలి. కొత్త అలైన్మెంట్ చాలా బాగుందని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే పారదర్శకంగా శ్వేత పత్రం విడుదల చేయాలి. కొత్త అలైన్మెంట్ మారడం వల్ల నష్టపోతున్న గ్రా మాల్లో సభలు నిర్వహించి, అక్కడి ప్రజల బాధ లు తీర్చాలి. ఆ రైతులకు మంచి నష్టపరిహారం ఇచ్చి ప్రాజెక్టును చేపట్టాలి.
కానీ మీ భూముల కోసం, ఆ భూముల ధరలు పెంచుకునేందుకు నిరుపేద రైతులు, గిరిజనులు, రాష్ర్టాన్ని బలిపెట్టి అప్పులఊబిలోకి తీసుకుపోతామంటే మాత్రం బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. అలైన్మెంట్ మార్పు ఎవరి కోసం? ఎవరి భూముల ధరలు పెరగడానికి? ఏ గద్దల భూదందా జరగడానికి? అనేది బయటకు రావాలి. అంటే.. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను కోరుతున్నా. దీని వెనకాల ఎవరి హస్తం ఉందనేది ప్రజలకు తెలియాలి. పేద రైతులను బెదిరించటంపైనా సీబీఐ విచారణ జరగాలి. లేకపోతే బండి సంజయ్, కిషన్‌రెడ్డి.. రేవంత్‌రెడ్డి ఒక్కటేనని.. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని తెలంగాణ ప్రజలు నమ్ముతరు’ అని పేర్కొన్నారు.
ఎలాంటి జోక్యం లేకుండానే ఉత్తర-దక్షిణ అలైన్మెంట్లు పూర్తి
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉత్తర-దక్షిణ భాగాలకు ఆర్ఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను కేంద్రమే పూర్తిచేసింది. అందులో ఎలాంటి రాజకీయ జోక్యంగానీ, తెలంగాణ ప్రభుత్వ జోక్యంగానీ లేదు. కేంద్రం నుంచి అలైన్మెంట్ ప్రతిపాదనలు వస్తే కొన్ని అభ్యంతరాలను అప్పట్లో చెప్పాం. ముఖ్యంగా అలైన్మెంట్ సర్వే సమయంలోలేని బస్వాపూర్ రిజర్వాయర్‌తో కాళేశ్వరం ప్రాజెక్టులోని పలు కాల్వలు, జలాశయాలు వచ్చే చోట కొంత అలైన్మెంట్ తప్పించాలని చెప్పాం. అది సహేతుకం కావడంతో వాటిని మార్పు చేశారు.
అలైన్మెంట్ విషయంలో ఏ ఒక్క రైతు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. కేంద్రం తొలుత ఉత్తర భాగం చేపడతామని చెప్పటంతో ఆ మేరకు అలైన్‌మెంట్‌ను అధికారికంగా నిర్ధారించి, భూసేకరణ కూడా 30-50 శాతం వరకు పూర్తి చేశారు. దక్షిణ భాగం అలైన్మెంట్ కూడా ఖరారైనందున దాన్ని కూడా వెంటనే చేపట్టాలని అప్పట్లోనే మేం కోరటంతో దక్షిణ భాగానికి సంబంధించిన అలైన్‌మెంట్‌ను కూడా పరిశీలించి, అభ్యంతరాలుంటే చెప్పాలని అన్నారు. మేం దానిని పరిశీలించి, నల్లగొండ జిల్లాలో డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించే శివన్నగూడెం రిజర్వాయర్ వచ్చే చోట అలైన్మెంట్ వస్తున్నందున దాన్ని తప్పించాలని సూచించటంతో ఆ మేరకు మార్పు చేశారు. అలైన్‌మెంట్‌ను ఫైనల్ చేశారు. దానికి సంబంధించిన ఫైల్ కేంద్రం వద్దే ఉన్నది. అయితే ఆ ప్రాజెక్టును భారత్‌మాల కింద చేపట్టాలా? మరో పథకమా? అని పరిశీలిస్తున్నారని తెలిసింది.
అలైన్మెంట్ తప్పిందిలా…