Prabhas | ఆయనపై ప్రభాస్ ప్రశంసల వర్షం.. అలాంటి రైటింగ్ ఎవరికి రాదు అంటూ కామెంట్
Prabhas | పాన్ ఇండియా స్టార్‌గా దూసుకెళ్తున్న ప్రభాస్ తాజాగా చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్.. తన కెరీర్ ప్రారంభ దశలో చేసిన సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా దర్శకుడు పూరీ జగన్నాథ్ తో చేసిన చిత్రాల గురించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
Prabhas | పాన్ ఇండియా స్టార్‌గా దూసుకెళ్తున్న ప్రభాస్ తాజాగా చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్.. తన కెరీర్ ప్రారంభ దశలో చేసిన సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా దర్శకుడు పూరీ జగన్నాథ్ తో చేసిన చిత్రాల గురించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రభాస్–పూరి కాంబినేషన్లో వచ్చిన బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ సినిమాలు అప్పట్లో యూత్‌లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాయి. ఈ రెండు చిత్రాల్లో ప్రభాస్ పూర్తిగా భిన్నమైన గెటప్, స్టైల్, బాడీ లాంగ్వేజ్‌తో కనిపించారు.
ఇటీవల ఓ ఫ్రెండ్లీ చిట్‌చాట్‌లో పాల్గొన్న ప్రభాస్ మాట్లాడుతూ, “బుజ్జిగాడు ఒక లెవెల్ అయితే, ఏక్ నిరంజన్‌లో నా రోల్ ఇంకా డిఫరెంట్‌గా అనిపించేది. ఆ పాత్రను ఎలా చేయాలి? ఎలా మాట్లాడాలి? అనే విషయాలపై చాలా ఆలోచించేవాణ్ణి” అని చెప్పారు. ఆ సినిమాలో డైలాగ్స్, పూరి గారి రైటింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. తనలాంటి రైటింగ్ మన తెలుగులోనే కాదు, ఇండియాలోనే కాదు, వరల్డ్‌లో కూడా ఎవరి వల్ల కాదు అంటూ దర్శకుడిపై ప్రశంసల వర్షం కురిపించారు. పాన్ ఇండియా, పాన్ వరల్డ్ మార్కెట్‌ను చూసిన హీరోగా ప్రభాస్ చెప్పిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ మాత్రం “ప్రభాస్ లాంటి స్టార్ ఇలా చెప్పడం అంటే పూరి టాలెంట్‌కు ఇదే పెద్ద సర్టిఫికేట్” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
గతంలో వరుస హిట్లతో ట్రెండ్ సెట్ చేసిన పూరీ జగన్నాథ్ నుంచి మళ్లీ ఓ సాలిడ్ కమ్‌బ్యాక్ రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న కొత్త సినిమా స్లమ్ డాగ్‌పై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం ద్వారా మరోసారి వింటేజ్ పూరిని చూడొచ్చా? అనే ఆసక్తి ఇండస్ట్రీలో నెలకొంది. మొత్తానికి, ప్రభాస్ చేసిన ఈ కామెంట్స్ పూరి అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. పాత కాంబో మళ్లీ రిపీట్ అయితే ఎలా ఉంటుందా? అనే చర్చలు కూడా మొదలయ్యాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

