‘హరీశ్‌కు బీఆర్ఎస్వీతో సంబంధం లేదు’
ఇల్లటూరి హరీశ్ అనే వ్యక్తికి బీఆర్ఎస్వీతో ఎటువంటి అధికారిక సంబంధం లేదని బీఆర్ఎస్వీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు సంకుబాపన అనుదీప్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు వ్యక్తి ఆర్గనైజేషన్‌లో ఎప్పుడూ పని చేయలేదని, సంస్థలో ఎటువంటి అధికారిక బాధ్యతను..
కొత్తగూడెం గణేష్ టెంపుల్, ఆగస్టు 11 : ఇల్లటూరి హరీశ్ అనే వ్యక్తికి బీఆర్ఎస్వీతో ఎటువంటి అధికారిక సంబంధం లేదని బీఆర్ఎస్వీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు సంకుబాపన అనుదీప్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు వ్యక్తి ఆర్గనైజేషన్‌లో ఎప్పుడూ పని చేయలేదని, సంస్థలో ఎటువంటి అధికారిక బాధ్యతను నిర్వహించలేదని తెలిపారు. బీఆర్ఎస్వీ పేరును ఉపయోగిస్తూ కొత్తగూడెం పట్టణంలోని కొన్ని విద్యా సంస్థల వద్ద హడావిడి సృష్టిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో విద్యార్థుల సమస్యలపై పోరాడుతూ, విద్యార్థుల హక్కుల కోసం ప్రజాస్వామ్య పద్ధతుల్లో పని చేస్తున్న సంస్థ బీఆర్ఎస్వీ అని, సంస్థకు సంబంధం లేని వ్యక్తులు సంస్థ పేరు చెప్పుకుని విద్యాసంస్థల వద్ద కార్యక్రమాలు నిర్వహించడం, విద్యార్థుల్లో గందరగోళం సృష్టించడం లేదా సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వ్యవహరించడం సరికాదని ఆయన అన్నారు. బీఆర్ఎస్వీ పేరుతో ఎవరైనా వ్యక్తిగతంగా కార్యకలాపాలు నిర్వహించినా, అలాంటి వ్యక్తులకు సంస్థతో ఎటువంటి సంబంధం లేదని విద్యార్థులు, విద్యా సంస్థల యాజమాన్యాలు, ప్రజలు గమనించాలని ఆయన కోరారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

